Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ మళ్లీ అదే ఫార్మాట్ కథ చెప్పాడా?
By: Tupaki Desk | 30 Dec 2021 9:30 AM GMTఒక కాంబినేషన్ ఎన్ని సార్లు కలిసినా చూడ్డానికి చాలా చూడముచ్చటగా వుంటుంది. అలాంటి కాంబినేషన్ సెట్టయిందంటే అంచనాలు కూడా ఓ రేంజ్ లో వుంటారు. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ ల కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా వచ్చి దాదాపు 11 ఏళ్లవుతోంది. ముందు `అతడు` చిత్రంతో వీరి కాంబినేషన్ కి క్రేజ్ ఏర్పడింది. తొలి సినిమా టెక్నికల్ గా సూపర్ అనిపించినా వసూళ్ల పరంగా మాత్రం భారీ నష్టాలని అందించిందిగా రికార్డు వుంది.
అయితే ఆ తరువాత 11 ఏళ్ల క్రితం `ఖలేజా` చేశారు. ఇది కూడా మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా డెఫ్‌షీట్ ప్రాజెక్ట్ గానే మిగిలింది. బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఈ సినిమా కూడా `అతడు` తరహాలో గుడ్ ప్రాజెక్ట్ గానే మిగిలింది కానీ నిర్మాతకు లాభాల్ని మాత్రం అందించలేకపోయింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న ఈ కాంబినేషన్ మళ్లీ 11 ఏళ్ల తరువాత సెట్టయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నిఎస్. రాధాకృష్ణతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులే అవుతున్నా ఇంచు కూడా ముందుకు కదలలేదు.
పైగా ఈ ప్రాజెక్ట్ వుంటుందా? వుండదా? .. ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి మహేష్ బాబు .. జక్కన్న ప్రాజెక్ట్ కి వెళ్లిపోతాడంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దుబాయ్‌లో ఫ్యామిలీతో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ని కలిసింది. త్రివిక్రమ్ తో పాటు సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ దుబాయ్ వెళ్లి మహేష్ ని ప్రత్యేకంగా కలిశారు. త్రివిక్రమ్ టీమ్ తో కలిసి ప్రత్యేకంగా గడిపిన ఫొటోలని మహేష్ షేర్ చేస్తూ `వర్క్ అండ్ చిల్ ప్రొడక్టీవ్ ఆప్టర్ నూన్ విత్ ద టీమ్` అంటూ ఇన్ స్టా లో ప్రకటించారు.
ఇదిలా వుంటే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ .. మహేష్ కు ఎలాంటి కథని చెప్పాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్ కి మరో సారి `అతడు` ఫార్మాట్ స్టోరీనే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందులో మహేష్ క్యారెక్టర్ చాలా సీరియస్ గా వుంటుందని, అతంఏ కాకుండా ఇందులో హీరోయిన్ గా నటించనున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే పాత్ర మహేష్ పాత్రకు పూర్తి భిన్నంగా చాలా కూల్ గా వుంటుందని చెబుతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ షూటింగ్ కి ప్రస్తుతం బ్రేకిచ్చారు. మహేష్ కు మోకాలి చికిత్స జరగడంతో ప్రస్తుతం తను దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోబోతున్నారు. ఆ తరువాతే హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తరువాతే `సర్కారు వారి పాట` చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఆ తరువాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.