Begin typing your search above and press return to search.
గురూజీ భారీగా వసూలు చేస్తున్నాడట...!
By: Tupaki Desk | 8 May 2020 3:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 'అరవిందసమేత వీరరాఘవ' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) - నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది. 'అల వైకుంఠపురం'లో సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేసాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా కోసం భారీగా వసూలు చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంట్లో నిజమెంతో తెలియదు కానీ.. రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమా నిర్మాతలకు త్రివిక్రమ్ కి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని ఏళ్లుగా వరుసగా ఆ ప్రొడక్షన్ కే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ పరిచయంతో సినిమా ప్రాఫిట్ లో షేర్ అడిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొనే త్రివిక్రమ్ ఈ సినిమాకి కూడా అదే ఫాలో అయ్యాడట. మరి కరోనా ఎఫెక్ట్ కారణంగా అందరూ పారితోషకాల్లో కోతలు విదించుకుంటున్న నేపథ్యంలో ఇది భారంగా మారే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. కాకపోతే ఈ రూమర్ లో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించి తారక్ - త్రివిక్రమ్ ఫోన్ లో డిస్కషన్ చేసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో తారక్ పక్కన జోడీని సెట్ చేసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్.