Begin typing your search above and press return to search.
చిరంజీవి వల్లే నేను చెడిపోలేదు
By: Tupaki Desk | 28 Dec 2018 5:42 AM GMTనిన్నటి సాయంత్రం `వినయ విధేయ రామ` ఈవెంట్ లో మాటల మాయావి త్రివిక్రముడు చెప్పిన మూడు మాటలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిమంతం. ఆ మూడు మాటలేవీ.. అంటే.. ``మందు కొట్టి పడిపోవడం కంటే - డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే.. రోడ్డు చివరన కూర్చుని అమ్మాయిలను ఏడిపించడం కంటే - థియేటర్ లో కూర్చుని ఓ హీరోను చూసి స్ఫూర్తి పొందడం చాలా మంచి విషయం`` అని అన్నారు. అలాంటి మంచి విషయాన్ని నాకు అందించి - నేను పాడుకాకుండా కాపాడిన చిరంజీవిగారికి నా కృతజ్ఞతలు. నాలాంటి ఎంతో మందిని ఆయన దారిలో పెట్టారు`` అని అన్నారు త్రివిక్రమ్. ప్రస్తుత యూత్ ఆలోచనా తీరుపై తనదైన శైలిలో సెటైర్ వేశారు మాటల మరాఠి.
మందేసి వీధి చివర అమ్మాయిల్ని ఏడిపించలేదు.. థియేటర్లకు వెళ్లి బాగుపడ్డాను! అని చెప్పడంలోనే సినిమాపై తన ప్రేమను చూపించారు. థియేటర్లలో గడపడమే బెటర్ అని యూత్ కి సూచించడం ద్వారా సినిమాల కలెక్షన్లు పెంచే ఎత్తుగడను అనుసరించాడు. అందుకేనేమో అతడిని మాయావి అని కీర్తించారు జనం. వినయ విధేయ రామ వేదికపై మెగాస్టార్ ని త్రివిక్రమ్ వర్ణించిన తీరు వండర్ ఫుల్. ``ఒక కోట.. ఆ కోట లోపల స్వర్గంలా ఉంటుంది. ఆ కోటకు వెళ్లే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా వెళ్లే దారి ఉంటుంది. అలాంటి కోట కట్టి .. దారి వేసిన చిరంజీవిగారి కుటుంబం మన అందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మన ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ల అబ్బాయి మన ఇంట్లో అబ్బాయిగా మారిపోయాడు. అలాంటి స్వర్గంలాంటి కోటను కట్టిన చిరంజీవిగారి గురించి మాట్లాడుకోవాలంటే మాటలు వెతుక్కోనక్కర్లేదు``అని వర్ణించారు. ``రామాయణం అధికారికంగా 300 వెర్షన్స్ ఉన్నాయి. కొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. గాంధీ గురించి ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. రామాలయం లేని వీధి ఉండదు. ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా మనం ఉండం. అలాంటి ఆంజనేయస్వామి భక్తుడైన చిరంజీవిగారి గురించి మాట్లాడకుండా సౌత్ ఇండియన్ సినిమా ఉండదు. క్యూలో నిలబడగి చొక్కా చిరిగిపోయిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇబ్బందితో సినిమా థియేటర్ లోకి వెళితే దాన్ని మరచిపోయేలా చేసిన చిరంజీవిగారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం. ఆయన మనకు అందించిన నవ్వులకు - స్టెప్పులకు - మనం అరిచిన అరుపులకు మనం ఏమివ్వగలం`` అంటూ ఆయనలోని కవిని బయటపెట్టారు.
``సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవి అని చదివిన నేను నీతిగా - నిజాయితీ - మిడిల్ క్లాస్ నుండి - ఓ పోలీసాఫీసర్ కొడుకు అయ్యి ఉండీ.. ఇంత ఉన్నత స్థాయికి రాగలిగారు. అలాంటప్పుడు నేను కూడా ఈస్థాయికి రాగలను అని సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. అలా పాజిటివ్ దృక్పథం నాలో కలిగించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు`` అని వినయ విధేయతను చాటుకున్నారు త్రివిక్రమ్. తనదైన వాక్చాతుర్యంతో త్రివిక్రమ్ వేదికపై ఆకట్టుకున్నారు. వీవీఆర్ వేదిక సాక్షిగా ఆయనలోని మాటల మాంత్రికుడు బయటికొచ్చాడు మరోసారి.