Begin typing your search above and press return to search.

సింహాన్ని పొగిడితే.. నక్కల సంగతేంది గురూజీ

By:  Tupaki Desk   |   28 Dec 2018 6:14 AM GMT
సింహాన్ని పొగిడితే.. నక్కల సంగతేంది గురూజీ
X
సినిమా ఫంక్షన్లంటే పొగడ్తలకు కేరాఫ్ అడ్రెస్. హీరోను.. డైరెక్టర్ ను..ముఖ్య అతిథిని.. వీలైతే నిర్మాతను పొగడ్తలతో చంపేస్తారు. నిన్న జరిగిన 'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్ ఈవెంట్ అందుకు మినహాయింపేమీ కాదు. చరణ్.. చిరంజీవి.. కేటీఅర్ లు పొగడ్తల వర్షంలో తడిసి..మునిగిపోయారు. ఇక అందరి స్పీచులు ఒక ఎత్తయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు కోటలు దాటాయి.

చిరంజీవి ని ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్ మెగాస్టార్ అందరికీ ఇన్స్పిరేషన్ అని తనకు కూడా ఆయనే ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. ఇంకా చాలా చాలా చెప్పాడు. చిరంజీవి వరకూ ఈ పొగడ్తలు బాగానే ఉన్నాయి. ఎక్కడా డోస్ ఎక్కువ కాలేదు. కానీ అదే ఊపులో చరణ్ ను కూడా ఒక చూపు చూశాడు. చరణ్ సింహం లాంటి వాడని అన్నాడు. సింహం మిగతా జంతువుల మాదిరిగా రోజూ వేటాడదని.. బాగా ఆకలేసినప్పుడు మాత్రం అడవిలోకి వెళ్తుందన్నాడు. కానీ అలా వెళ్ళిన రోజు మాత్రం వేట సాలిడ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ ఉపమానాలు 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్లను ఉద్దేశించి అన్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా.

కానీ అంతటితో ఆగకుండా సింహం వేటాడి తినగా వదిలేస్తే మిగిలిన దాంతో చాలారోజుల పాటూ నక్కలు.. హైనాలు పండగ చేసుకుంటాయని అన్నాడు త్రివిక్రమ్. అంతా నిజమే. సింహం గురించి కాస్త ఇన్ ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకు తెలిసిందే. త్రివిక్రమ్ చరణ్ ను సింహం తో పోల్చాడు.. పొగిడాడు సరిపోయింది. కానీ త్రివిక్రమ్ చెప్పిన నక్కలు.. హైనాలు ఎవరని.. ఆ మిగిలిన దాన్ని తినేవాళ్ళు ఎవరని ఇప్పుడు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. చరణ్ సింహం అయితే.. మిగతా హీరోలు మిగిలిన దాన్ని తినే నక్కలు.. హైనాలని అన్వయించుకోవాలా.. అని అడుగుతున్నారు. అంతే కాదు చరణ్ బాక్స్ ఆఫీస్ వేటకు వెళ్ళిన ప్రతిసారి బ్లాక్ బస్టర్లు సాధించలేదని గుర్తు చేస్తున్నారు. చరణ్ కంటే బెటర్ రికార్డులు ఉన్న హీరోలు ఉన్నారని.. అవన్నీ పట్టించుకోకుండా పొగిడే క్రమంలో త్రివిక్రమ్ లిమిట్ దాటాడని అంటున్నారు.