Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కలం పదును చూడండి..
By: Tupaki Desk | 3 Jun 2016 1:30 PM GMTనరేష్ (సీనియర్) పేరుమోసిన లాయర్. కోటీశ్వరుడు. కానీ భార్యా బాధితుడు. ఆమె మాటకు ఎదురు చెప్పలేడు. కూతురు సమంత అతణ్ని ఎందుకు డాడీ అమ్మంటే మీకు అంత భయం.. ఎందుకు ఆమెకు ఎదురు మాట్లాడరు అంటుంది. దానికి బదులుగా నరేష్.. ‘‘మాట్లాడకుండా ఉంటే ముని అంటారనుకున్నాను.. కానీ మూగోడిగా ముద్ర వేసేస్తారనుకోలేదు’’ అని బదులిస్తాడు. ‘అఆ’ సినిమాలో త్రివిక్రమ్ పెన్ పవర్ ఏంటో తెలియజెప్పే ఫస్ట్ డైలాగ్ ఇది. ఇక అక్కడి నుంచి మొదలుపెడితే. త్రివిక్రమ్ మార్కు డైలాగులు ఎన్నెన్నో. అక్కడక్కడా కొన్ని డైలాగులు సిల్లీగా అనిపించినా.. ఓవరాల్ గా మాత్రం త్రివిక్రమ్ కలం పదును చాలాచోట్ల కనిపిస్తుంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కొంచెం చమత్కారం పాళ్లు తగ్గించినట్లు కనిపించినా ఈసారి మాత్రం మాటల మాంత్రికుడు తన ప్రత్యేకతను చూపించాడు.
ముఖ్యంగా సినిమాలో రావు రమేష్ కు రాసిన డైలాగులైతే అదిరిపోయాయని చెప్పాలి. ‘‘మరీ మినరల్ వాటర్ తో ముఖం కడుక్కుంటే బలుపనుకుంటార్రా.. ఆ లేబుల్’’ తీసేయ్ అంటూ చెప్పే ఫస్ట్ డైలాగే కేక అనిపిస్తుంది. ఇక చివర్లో అతను చెప్పే డైలాగులైతే.. ప్రేక్షకులకు మామూలు కిక్కు ఇవ్వవు. ‘‘రోడ్డు వైడెనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగుంది నా పరిస్థితి.. ఉండటానికి పనికి రాదు. వదిలేద్దామంటే మనసొప్పదు’’ అని రావు రమేష్ అన్నపుడు థియేటర్ హోరెత్తిపోయింది. హీరోయిన్ చెలికత్తె తరహా పాత్రలో కనిపించిన హరితేజ ఓ సన్నివేశంలో ప్రవీణ్ ను ఉద్దేశించి.. ‘‘పైకొస్తారా’’ అంటుంది. అతనేమో.. ‘‘అందుకే కదండీ రేయింబవళ్లు ఇలా కష్టపడుతున్నాను’’ అంటాడు. ‘‘మెట్లెక్కితే సరిపోతుందే’’ అని పంచ్ వేసేస్తుందామె. ఇలాంటి త్రివిక్రమ్ మార్కు చమక్కులు చాలా ఉన్నాయ్ ‘అఆ’లో.