Begin typing your search above and press return to search.
దేవుడే అందరిని ఒప్పించలేడు.. నేనెంతా?
By: Tupaki Desk | 3 Feb 2020 5:11 AM GMTఅల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కి సంక్రాంతి కానుక గా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. కొన్ని ఏరియాల్లో బాహుబలి 1 ను కూడా క్రాస్ చేసి రెండవ స్థానంలో నిలిచింది. అద్బుతమైన విజయం దక్కించుకున్న చిత్ర యూనిట్ సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత హ్యాపీలో కూడా వారిని కొన్ని విమర్శలు చిరాకు పెట్టాయి.. ఇంకా పెడుతూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఈ సినిమాపై బ్యాడ్ కామెంట్స్ చేసే వారు చాలా మందే ఉన్నారు. ఇది రెండు మూడు సినిమాలకు కాపీ అని త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా ఉందని.. కొత్తదనం లేకుండా ఏదో బన్నీ క్రేజ్ తో ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా నెట్టుకు వచ్చిందంటూ కామెంట్స్ చేసేవారు లేకపోలేదు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆ విమర్శలపై స్పందిస్తూ తనదైన శైలిలో వాటికి సమాధానం ఇచ్చాడు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను రాసిన చిరునవ్వు తో సినిమాలో 'ప్రపంచంలో కొంత మందికి ఆంజనేయ స్వామి నచ్చుతాడు కొందరికి షిర్డీ సాయి బాబా నచ్చుతాడు మరి కొందరికి మరో దేవుడు నచ్చుతాడు. దేవుడే మనుషులందరిని కూడా మెప్పించలేక పోతున్నాడు. అలాంటప్పుడు నేను ఎలా అందరిని మెప్పిస్తాను' అంటూ డైలాగ్ ఉంటుంది అన్నాడు. ఆ డైలాగ్ లో మాదిరిగా తాను అందరిని ఎలా మెప్పించగలను అనే అర్థం వచ్చేలా త్రివిక్రమ్ ఒక్క మాటతో విమర్శలకు సమాధానం చెప్పేశాడు.
మగధీర చిత్రం నుండి నిన్న మొన్న వచ్చిన సినిమాల వరకు అన్ని సినిమాలకు కూడా వివాదాలు అవ్వడం కామన్ అయ్యింది. ఇప్పటి వరకు హిట్ అయ్యి రికార్డులు సాధించిన ఏ సినిమా వివాదం కాలేదో మీరు నాకు చెప్పండి అంటూ త్రివిక్రమ్ ప్రశ్నించాడు. సినిమా ఫలితంపై వివాదం ఎలాంటి ప్రభావం చూపదని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారు అనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శణం అంటూ ఈ సందర్బంగా త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.