Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' లో త్రివిక్రమ్ వాటా..?
By: Tupaki Desk | 27 Nov 2021 2:30 AM GMTఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారని అందరూ చెబుతుంటారు. ఇప్పటి వరకు వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. అందులో 'జల్సా' 'అత్తారింటికి దారేది' సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ గా నిలిచింది.
పవన్ నటించిన 'తీన్ మార్' చిత్రానికి సంభాషణలు రాసిన త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మించిన 'చల్ మోహన్ రంగా' చిత్రానికి కథ - మాటలు అందించారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాకి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ రీమేక్ సినిమాకి డైరెక్టర్ సాగర్ కె చంద్రనే అయినా త్రివిక్రమ్ అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అయితే.. మరో కారణం నిర్మాతలు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హాసిని అండ్ హారిక క్రియేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థల అధినేత రాధాకృష్ణ (చినబాబు) ఎప్పటి నుంచో స్నేహితుడు. ఇటీవల కాలంలో అగ్ర దర్శకుడు డైరెక్ట్ చేసే ప్రతీ సినిమా కూడా వారి బ్యానర్ లోనే చేస్తున్నారు. ఇప్పుడు స్నేహితులు కలిసి చేస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాలో భాగం అయ్యారు.
నిజానికి 'భీమ్లా నాయక్' కార్యరూపం దాల్చడానికి కారణమే త్రివిక్రమ్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' గురించి త్రివిక్రమ్ తో చెప్పగా.. రైట్స్ తీసుకోమని సలహా ఇచ్చింది ఆయనే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లోకి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది కూడా త్రివిక్రమే. అందుకే ఈ సినిమా కోసం అన్నీ తానై చూసుకుంటున్నారని తెలుస్తోంది.
'అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కూడా త్రివిక్రమ్ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. గతేడాది ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన సినిమా తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. మహేష్ బాబుతో మరో చిత్రాన్ని ప్రకటించినా ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ పూర్తిగా 'భీమ్లా నాయక్' సినిమా పనుల్లో బిజీగా ఉండటమే అని ఊహాగానాలు వినిపించాయి.
ఏదైతేనేం స్నేహితుల కోసం ఏకే రీమేక్ బాధ్యత తీసుకున్నారు త్రివిక్రమ్. ఇందుకు గానూ రెమ్యూనరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని.. దాదాపు పదిహేను కోట్ల వరకు అందుతుందని ప్రచారం జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ ఈ సినిమా కోసం కేటాయించిన సమయానికి ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం సముచితమే అనిపిస్తుంది. అందులోనూ ఈ ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ జాయిన్ అయిన తర్వాత సినిమా మార్కెట్ మరో స్థాయికి వెళ్ళింది.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో పవన్ తో పాటుగా రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.