Begin typing your search above and press return to search.
పాత త్రివిక్రమ్ ను గుర్తుకు తెస్తాడా?
By: Tupaki Desk | 3 April 2018 7:40 AM GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువమంది ఇష్టపడతారు. అందులోనూ దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ రచయితగా గొప్పగా రాణించాడు. ‘స్వయంవరం’.. ‘నువ్వే కావాలి’.. ‘చిరునవ్వుతో’.. ‘నువ్వు నాకు నచ్చావ్’.. ‘మన్మథుడు’.. ‘మల్లీశ్వరి’.. ఇలా రచయితగా త్రివిక్రమ్ మెరుపులు చాలానే ఉన్నాయి. ఇవన్నీ క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి. ఐతే దర్శకుడిగా మారాక త్రివిక్రమ్ కమర్షియల్ అయిపోయాడని.. రచయితగా ఆయన స్థాయి తగ్గిందని అంటుంటారు చాలామంది.
ఐతే చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ ఇప్పుడు కేవలం రచయితగా ఒక సినిమా చేశాడు. అదే.. చల్ మోహన్ రంగ. ఈ చిత్రానికి కథ త్రివిక్రముడిదే అన్న సంగతి తెలిసిందే. ఈ దశలో త్రివిక్రమ్ మరో సినిమాకు కథ అందించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఐతే లిరిసిస్ట్ టర్న్ డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య తొలి సినిమా ‘రౌడీఫెలో’ చూసి ఇంప్రెస్ అయ్యి కొన్నేళ్లుగా అతడితో ట్రావెల్ చేస్తున్న త్రివిక్రమ్.. తనే స్వయంగా ‘చల్ మోహన్ రంగ’ కథ రాసి అతడితో డైరెక్ట్ చేయిస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి కూడా. స్క్రిప్టులోనూ త్రివిక్రమ్ టచ్ ఉంటుందని సమాచారం. మామూలుగా త్రివిక్రమ్ కథ ఇస్తే.. మాటలు కూడా రాస్తాడు. ఐతే కృష్ణచైతన్య స్వయంగా మాటల రచయిత కావడం.. ‘రౌడీఫెలో’లో మాటలతో బలమైన ముద్ర వేయడంతో త్రివిక్రమ్ జోక్యం చేసుకోలేదు. ఐతే త్రివిక్రమ్ స్టైల్ ఉండేలా ఈ చిత్ర స్క్రిప్టును తీర్చిదిద్దాడట కృష్ణచైతన్య. ఈ చిత్రంతో రచయిత త్రివిక్రమ్ మరోసారి తన మార్కు చూపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.