Begin typing your search above and press return to search.
`రంగ్ దే` జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది!-త్రివిక్రమ్
By: Tupaki Desk | 22 March 2021 3:30 AM GMTయూత్ స్టార్ నితిన్- కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం `రంగ్ దే`. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. ఈ నెల 26న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో చిత్రబృందంపై గురూజీ త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు.
వేదికపై త్రివిక్రమ్ మాట్లాడుతూ ``అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడు రంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది`` అని అన్నారు.
అర్జున్ (నితిన్)- అను (కీర్తి) పాత్రలు నాకు బాగా నచ్చాయి. సినిమా చూశాను .. చాల బాగా నచ్చింది. దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు దేవీశ్రీ పాటలతో మెప్పించారు. `ఊరంతా చీకటి` పాట థియేటర్ లో ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తుంది.. అని అన్నారు.
వెంకీ గత చిత్రాలకు పని చేయాల్సి ఉన్నా కుదరలేదు. రంగ్ దే కి కుదిరింది. యువతరం మెచ్చే పరిణతి చెందిన ప్రేమకథా చిత్రమిది. నితిన్ చేసిన సినిమాల్లో విభిన్నంగా ఉంటుందని దేవీశ్రీ అన్నారు. నితిన్- కీర్తి తమ పాత్రలకు ప్రాణం పోశారని వెంకీ అట్లూరి అన్నారు. లాక్ డౌన్ లో సహకరించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.