Begin typing your search above and press return to search.

మీనా చిత్రమంటే తనకెంతో ఇష్టమన్న గురూజీ

By:  Tupaki Desk   |   29 Jun 2019 11:36 AM GMT
మీనా చిత్రమంటే తనకెంతో ఇష్టమన్న గురూజీ
X
లెజెండరీ నటి.. దర్శకురాలు విజయనిర్మల మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు.. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయనిర్మలకు నివాళులు అర్పించారు. కృష్ణగారిని.. విజయనిర్మల తనయుడు నరేష్ ను పరామర్శించారు. నిన్న విజయనిర్మల గారి అంతిమయాత్ర పూర్తయింది.

అయితే నానక్ రామ్ గూడ లోని విజయనిర్మల నివాసానికి ప్రముఖుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయనిర్మల నివాసానికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయనిర్మలగారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయనిర్మల గురించి మాట్లాడుతూ ఆమె మరణం తనకు ఎంతో బాధ కలిగించినని చెప్పారు.

విజయనిర్మలగారు దర్శకత్వం వహించిన 'మీనా' చిత్రం అంటే తనకెంతో ఇష్టమని చెప్తూ.. ఆ సినిమా స్ఫూర్తితోనే 'అ ఆ' సినిమాను తెరకెక్కించానని తెలిపారు. త్రివిక్రమ్ ఇష్టపడే వ్యక్తుల్లో గౌరవించే వ్యక్తులలో విజయనిర్మలగారు ఒకరని చెప్పారు. వాళ్ళబ్బాయి నరేష్ గారితో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఫిలిం ఇండస్ట్రీ.. తెలుగువారు అందరూ అండగా ఉండాలని అన్నారు.