Begin typing your search above and press return to search.
‘ప్రేమమ్’ చూసి త్రివిక్రమ్ ఏం సలహా ఇచ్చాడు?
By: Tupaki Desk | 18 Oct 2016 7:28 AM GMT‘ప్రేమమ్’ సినిమా రషెస్ చూసి.. గో అహెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్లలో అక్కినేని నాగార్జునతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఐతే రషెస్ చూడటం కాదు.. అంతకంటే ముందు అసలు ఈ సినిమా మొదలయ్యే దశ నుంచి త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉందట. ఈ విషయాన్ని ‘ప్రేమమ్’ దర్శకుడు చందూ మొండేటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘ప్రేమమ్ మలయాళ ఒరిజినల్ చూశాక త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రచయితగా పని చేసిన నువ్వేకావాలి సినిమాను గుర్తు చేశారు. ఆ సినిమా కూడా మలయాళ రీమేకే. కానీ ఒరిజినల్ కు.. తెలుగు వెర్షన్ కు పోలికే ఉండదు. మలయాళంలో ఆ చిత్రం కూడా పొయెటిగ్గా ఉంటుంది. ఐతే అందులోని సోల్ తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎంటర్టైన్మెంట్ జోడిస్తూ ఎలా స్క్రిప్టు తయారు చేసుకున్నది వివరించారు.
‘ప్రేమమ్’ తెలుగులో ఎలా తీయాలనుకుంటున్నవో ముందు నిర్ణయించుకోమని త్రివిక్రమ్ గారు చెప్పారు. ఉన్నదున్నట్లు తీస్తే మన ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చని చెప్పారు. ఆయన సలహా మేరకే.. ఆయన ‘నువ్వేకావాలి’కి చేసినట్లే తెలుగు వెర్షన్ ను కూడా మన నేటివిటీకి తగ్గట్లు మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆయన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక సినిమా రషెస్ చూశాక నాగార్జున గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా పాజిటివ్ గా స్పందించడంతో సినిమా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది’’ అని చందూ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/