Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసిపై గురూజీకి ఇంకా ఆశ చావలేదండోయ్
By: Tupaki Desk | 27 May 2018 4:56 PM GMTత్రివిక్రమ్ ది దర్శకుల్లో సపరేట్ వెర్షన్. ఆయన సినిమాలను ఎవరితోనూ పోల్చలేం. సాధారణ క్యారెక్టర్లు కూడా ఎంతో పొయెటిక్‌గా మలిచే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ ని చవిచూశారు. అతడు - అత్తారింటికి దారేది సినిమా తీసిన దర్శకుడే ఈ సినిమా తీశాడా అని జనం విస్మయం చెందేటంత పేలవంగా తీశారా సినిమా. ఎన్నో రికార్డులు సాధిస్తుందనుకున్న ఆ సినిమా రికార్డులు సాధించింది కానీ ఫ్లాపుల్లో రికార్డులవి. కేవలం త్రివిక్రమే కాకుండా పవన్ ఇమేజ్ కూడా భారీగా దెబ్బతీసిన సినిమా ఇది.
సినిమా ఎందుకంత దారుణంగా తెరకెక్కింది అనే రహస్యాన్ని విప్పారు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని చెప్పిన త్రివిక్రమ్ ఎమోషన్లు క్యారీ అవ్వలేదన్నారు. ఒక రాజు.. ఓ రాజ్యం అంటూ సాధారణ భాషలో చెప్పాల్సిన సినిమాను కార్పొరేట్ భాషలో చెప్పేటప్పటికి ఎమోషన్ తప్పిందన్నారు. అలా చెప్పినపుడు అది బిజినెస్ వార్త అవుతుంది గాని సినిమా కాదని... అందుకే జనం తీసి పక్కన పడేశారన్నారు. ‘అజ్ఞాతవాసి’ జనాలను కేవలం డిజప్పాయింట్ చేసిందని, కానీ నాకు జ్ఞానోదయం చేసిందని చెప్పారు త్రివిక్రమ్. దాని ప్రభావం నాపై ఎప్పటికీ ఉంటుందన్నారు.
అయితే, ఒక తప్పును ఒప్పుకుని మరో సమర్థనకు కూడా దిగారాయన ఈ సినిమా గురించి. అదేంటంటే... ఖలేజా సినిమా థియేటర్లో ఫెయిలైనా టీవీలో బాగా హిట్టయ్యిందని అలాగే అ ‘అజ్ఞాతవాసి’లో విషయంలో జరుగుతుందని అంటున్నారు. అయితే గురూజీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే... ఖలేజా సినిమాగా బాలేకపోయినా సీన్ టు సీన్ బాగుంటుంది. అలాంటి సీన్లేవీ అజ్ఞాతవాసిలో లేనపుడు టీవీల్లో మాత్రం ఎలా వర్కవుట్ అవుతుందో మరి!