Begin typing your search above and press return to search.

అతడి ప్రతిభకు త్రివిక్రమ్ ఫ్లాట్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   18 Nov 2016 5:16 AM GMT
అతడి ప్రతిభకు త్రివిక్రమ్ ఫ్లాట్ అయిపోయాడు
X
దర్శకుడు కావడానికి ముందు రచయితగా చాలా సినిమాలే చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘నువ్వే కావాలి’ దగ్గర్నుంచి విజయ్ భాస్కర్ చేసిన ప్రతి సినిమాకూ త్రివిక్రమే రచయిత. ఐతే దర్శకుడిగా మారాక మాత్రం వేరే సినిమాల జోలికి దాదాపుగా వెళ్లలేదు. ఒక్క ‘తీన్ మార్’ సినిమాకు మాత్రం మాటలు అందించాడంతే. ఇక ఆ తర్వాత ఆ పని కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నితిన్ కొత్త సినిమా కోసం కథ అందించడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు త్రివిక్రమ్ ఉన్న స్థాయికి తన కథను మరొకరు బాగా డీల్ చేస్తాడని నమ్మి ఇవ్వడం అనూహ్యమే. ఐతే లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య మీద త్రివిక్రమ్ కు ఉన్న గురి వల్లే అతడికి కథ ఇచ్చాడు.

దర్శకుడిగా కృష్ణచైతన్య చేసిన తొలి సినిమా ‘రౌడీ ఫెలో’ అంటే త్రివిక్రమ్ కు చాలా ఇష్టం. ఈ సంగతి స్వయంగా ఓ వేడుకలో చెప్పాడు త్రివిక్రమ్. మాటల రచనలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన త్రివిక్రమే ‘రౌడీఫెలో’లో కృష్ణచైతన్య రాసిన మాటలకు ఫిదా అయిపోయాడు. అందులోని డైలాగ్స్ గురించి కూడా ఓ సందర్భంలో ప్రస్తావించాడు. కృష్ణచైతన్య టాలెంట్ నచ్చే.. ‘అఆ’ సినిమా టైంలో అతడితో ట్రావెల్ చేశాడు త్రివిక్రమ్. అప్పటికే నితిన్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కృష్ణచైతన్య. ఐతే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ కు దగ్గరయ్యాడు కృష్ణచైతన్య. ‘అఆ’ సినిమాకు తనవంతు సహకారం కూడా అందించాడు. అందులో అనసూయ కోసం.. అనే పాట కూడా రాసి అవసరానికి సాయపడ్డాడు. మొత్తంగా కృష్ణచైతన్య టాలెంటేంటో అర్థమయ్యాక అతడి కోసం కథ రాశాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా కృష్ణచైతన్య మీద భరోసాతో ఈ సినిమాను స్వయంగా నిర్మించడానికి ముందుకొచ్చాడు. మొత్తానికి ఒక సర్ప్రైజింగ్ కాంబినేషన్లో సినిమా మొదలైంది. మరి తన మీద ఇంతమంది పెట్టుకున్న నమ్మకాన్ని కృష్ణ చైతన్య ఎంత మేరకు నిలబెడతాడో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/