Begin typing your search above and press return to search.

మెగా హీరోలను వదలనంటున్న త్రివిక్రమ్..

By:  Tupaki Desk   |   20 March 2020 4:30 PM GMT
మెగా హీరోలను వదలనంటున్న త్రివిక్రమ్..
X
త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ కి పరిచయం లేని పేరు. తన డైలాగ్స్ తో, పంచులతో తనకంటూ సెపెరేట్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. తొలుత సినీ రచయితగా పరిచయమైన త్రివిక్రమ్ 2002లో 'నువ్వేనువ్వే' సినిమాతో దర్శకునిగా మారాడు. ఆయన సినిమాలకు మాటలు ఎంత ఫాస్ట్ గా రాస్తాడో.. సినిమాలు అంత లేటుగా తీస్తాడనే టాక్ ఉంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా త్రివిక్రమ్ తీసిన సినిమాలు పదకొండే. అందులోను తీసిన హీరోలతోనే ఎక్కువ సినిమాలు తీస్తుంటాడు.

ఇంతవరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలలో రిపీట్ అవ్వని హీరోలు ఎవరంటే నితిన్, తరుణ్ లు మాత్రమే. ఎందుకంటే 'అరవింద సమేత' తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ చేసిన సినిమాలలో రెండు మహేష్ బాబుతో, పవన్ కళ్యాణ్ తో మూడు, అల్లు అర్జున్ తో మూడు, త్వరలో ఎన్టీఆర్ తో రెండోది పూర్తిచేయనున్నారు. త్రివిక్రమ్ ఏ హీరోతో తీసినా తిరిగి మళ్లీ మెగా ఫ్యామిలీ వైపే మొగ్గుచూపుతున్నాడని టాలీవుడ్ కోడై కూస్తుంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా తర్వాత త్రివిక్రమ్ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లో చేరనున్నారట. ప్రస్తుత సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో, రాంచరణ్ లతో సినిమాలు రూపొందిస్తారని సమాచారం. దీని పరంగా చూసుకుంటే త్రివిక్రమ్ నిజంగానే మెగా ఫ్యామిలీతో ముడేసుకున్నట్లే అనిపిస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. బయట టాలెంట్ ఉన్న హీరోలు చాలామంది ఉండగా త్రివిక్రమ్ మెగా హీరోల పైనే ఎందుకు మక్కువ చూపుతున్నాడో అర్ధం కావట్లేదని.. మిగతా హీరోలతో చేయొచ్చుకదా అని త్రివిక్రమ్ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. చూడాలి మరి ఆయన నుండి త్వరలో ఎలాంటి జవాబు రానుందో..!