Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఈసారైనా ఎట్రాక్ట్ చేస్తాడా?
By: Tupaki Desk | 25 May 2016 3:30 PM GMTఇప్పుడు అందరూ త్రివిక్రమ్ ఏం చేస్తాడు అనే చూస్తున్నారు. అసలే మనల్ని బడా స్టార్లయిన పవన్ అండ్ మహేష్ లు ఈ సీజన్ లో బాగా డిజప్పాయింట్ చేయడం వలన.. కనీసం ఈ మాటల మాంత్రికుడు అయినా ఎంటర్టయిన్ చేస్తాడా అని పబ్లిక్ మొత్తం చూస్తోంది. కామన్ పబ్లిక్ ఏమో గాని.. క్రిటిక్స్ మాత్రం.. అసలు ఈసారైనా మనోడు మాంచి రేటింగులు తెచ్చుకుంటాడా అని చూస్తున్నారు.
విషయం ఏంటంటే.. 2010లో వచ్చినీ ఈయన ఖలేజా.. డిజాష్టర్. ఆ తరువాత వచ్చిన జులాయ్ సినిమాకు 3 స్టార్లు వచ్చినా కూడా.. యావరేజ్ అనే టాకే వచ్చింది. విమర్శకులకు పెద్దగా కిక్కివ్వలేదు. ఇక 2013లో అత్తారింటికి దారేది ఇండస్ర్టీ హిట్ అయినప్పటికీ.. ఆ క్రెడిట్ అంతా పవన్‌కళ్యాణ్ ఖాతాలో పడింది. క్రిటిక్స్ సినిమాలో కథ లేదంటూ ఏకేశారు. కాకపోతే పవన్ మేనియా అంటూ పొగిడేశారు. తరువాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది. అది కూడా విమర్శకులకు నచ్చలేదు. బన్నీకి 50 కోట్లషేర్ వచ్చినా.. అందరూ 2.5 నుండి 2.75 రేంజు రేటింగులే ఇచ్చారు. ఈ లెక్కన చూసుకుంటే.. అసలు ''జల్సా'' సినిమా తరువాత విమర్శకులకు నచ్చిన త్రివిక్రమ్ సినిమా ఒక్కటీ లేదు మరి. కాలక్రమేణా మనోడు రాసిన డైలాగులు క్లాసిక్ గా అనిపిస్తున్నాయి.. ఇనస్టాంట్ గా సినిమా రిలీజైన రోజు మాత్రం.. అబ్బే కిక్కివ్వట్లేదు.
ఇప్పుడు ''అ..ఆ'' సినిమాతో వస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు. కేవలం మాటలతోనే కాకుండా.. మరి కంటెంట్ వైజ్ ఈసారైనా విమర్శకులకు సైతం కిక్కస్తాడని ఆశిద్దాం.