Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ బాగా ఫోర్స్ చేస్తున్నాడట
By: Tupaki Desk | 10 March 2016 7:30 PM GMTఇప్పుడు ఫిలిం నగర్ లో ఎక్కడ చూసినా కూడా ఒక్కటే టాపిక్. ఏప్రిల్ 8న సర్దార్ వస్తోంది.. 22న సరైనోడు వస్తోంది.. మే 20న బ్రహ్మోత్సవం వస్తోంది.. మరి వీటి మధ్యలో నితిన్ సినిమా రావడం ఎంతవరకు వర్కవుట్ అయ్యే ఛాన్సుంటుంది? మే 6న ''అ..ఆ'' సినిమాతో వస్తాం అని నితిన్ చెప్పేశాడు కాబట్టి.. అసలు ఇది మంచి ఐడియానా కాదా అంటూ విశ్లేషకులు ఇప్పుడు సనుగుతున్నారులే.
మ్యాటర్ ఏంటంటే.. అసలు ''అ..ఆ'' సినిమాకు అనుకున్నదానికంటే చాలా ఎక్కువే అయ్యింది. 25 కోట్లలో పూర్తి చేద్దాం అనుకుంటే.. ఒక 40 వరకు టచ్ అయ్యిందని టాక్. అయితే కేవలం నితిన్ పరంగా చూసుకుంటే.. మనోడు మార్కెట్ ఒక 20 కోట్లు ఉంటుంది. మరి త్రివిక్రమ్ ఫేస్ వాల్యూ కూడా కలుపుకుంటే ఇంకొంచెం పెరగొచ్చు. ఇప్పటివరకు కేవలం స్టార్లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.. అసలు సోలోగా చిన్న హీరోలతో సినిమాలు చేస్తే ఎంతొస్తుంది అనే విషయం చెప్పలేం. అలాంటప్పుడు ఈ 40 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ను రికవర్ చేయాలంటే.. మాంచి హాలిడే సీజన్ లో రావాలి. అందుకు సమ్మర్ కంటే పెద్ద సీజన్ ఏముంటుంది చెప్పండి?
ఈ లాజిక్ అంతా వివరించి.. సినిమాను సమ్మర్ లోనే తేవాలి అంటూ త్రివిక్రమ్ సార్ బాగా ఫోర్స్ చేస్తున్నారట. అందుకే వీళ్లు మే 6 అనే డేటును ఖరారు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కంటెంట్ లో దమ్ముంటే.. పక్కన ఎంత పెద్ద సినిమా ఉన్నా కూడా వర్కవుటయ్యే ఛాన్సుంటుంది. అయ్యో పాపం నాగ్ అన్నారు.. మరి సంక్రాంతికి హైప్ లేకుండా వచ్చి చితక్కొట్టేయలేదు ఆయన సినిమా. త్రివిక్రమ్ కూడా అలాంటి రిజల్టు రిపీట్ చేస్తాడేమో చూద్దాం.