Begin typing your search above and press return to search.
కవాతు వెనక త్రివిక్రమ్ అంటున్నారే!
By: Tupaki Desk | 14 Oct 2018 7:14 AM GMTకొన్ని విషయాలపై ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా జనాలు మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు. ఆ క్లారిఫికేషన్స్ ను అసలు పట్టించుకోనట్టుగా.. విననట్టుగా మళ్ళీ విమర్శలు చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో సార్లు జనసేన పార్టీ విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఏమాత్రం లేదని చెప్పడం జరిగింది. మరోవైపు 'అరవింద సమేత' ప్రమోషన్స్ లో మాట్లాడుతూ అసలు రాజకీయాల విషయం పట్టించుకోనని.. న్యూస్ పేపర్లు చదవనని.. న్యూస్ ఛానల్స్ చూడనని తెలిపాడు. పవన్ పొలిటికల్ స్పీచులు మీరు రాస్తారని బయట అనుకుంటున్నారు అని అడిగితే.. "నా స్క్రిప్ట్ రాసుకునేందుకే నాకు బద్దకం..ఇక పవన్ ప్రసంగాలు నేనెలా రాస్తాను" అని నవ్వేశాడు. పవన్ కు తన సహకారం అవసరం లేదని అన్నాడు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నిన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. రామజోగయ్య శాస్త్రి జనసేన కవాతు పాటకు పని చేశారని చెప్పి అందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక చూడండి.. వెంటనే విమర్శలు మొదలయ్యాయి. ఈ కవాతు పాట వెనక త్రివిక్రమ్ ఉన్నాడని.. థమన్ - రామజోగయ్యలు రీసెంట్ గా 'అరవింద సమేత' కు త్రివిక్రమ్ తో కలిసి పనిచేశారని ఇపుడు ఈ కవాతు వెనక ప్లానింగ్ గురూజీదే అని ప్రచారం మొదలు పెట్టారు.
కానీ వాళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటంటే పవన్ తన ట్వీట్ లో క్లియర్ గా 'ఖుషి' సినిమా టైమ్ నుండి థమన్ తనకు తెలుసనీ అప్పట్లో థమన్ టీనేజర్ అని తెలిపాడు. అప్పట్లో మణిశర్మ కు థమన్ అసిస్టెంట్ గా పని చేసేవాడు. ఆసమయంలో పవన్ కు - త్రివిక్రమ్ కు పరిచయం లేదు. అయినా పవన్ రేంజ్ కి ఒక పాట చేయించుకోవాలంటే డైరెక్ట్ గా అడిగి చేయించుకోలేడా..? ఎవరు 'నో' చెప్తారు? అందుకోసం త్రివిక్రమ్ సాయం కావాలా? పవన్ ను ఎదో ఒకటి అనాలని చేసే విమర్శలా అనిపించడం లేదూ