Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ‘నా పేరు సూర్య’ చూసి..
By: Tupaki Desk | 6 May 2018 9:44 AM GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల గురించి మాట్లాడటమే అరుదు. ప్రమోషన్ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడు. వేరే సినిమాల గురించి కూడా ఆయన పబ్లిగ్గా మాట్లాడటం చాలా అరుదు. ఐతే తనకేదైనా సినిమా నచ్చితే నేరుగా ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి అభినందించడం త్రివిక్రమ్ కు అలవాటు అంటారు. తాజాగా ఆయన ‘నా పేరు సూర్య’ సినిమా చూసినట్లు సమాచారం. తర్వాత దర్శకుడు వక్కంతం వంశీకి ఫోన్ చేసి ప్రశంసల జల్లు కురిపించాడట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వంశీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. త్రివిక్రమ్ తనకు ఫోన్ చేసి.. చాలా నిజాయితీగా ఈ సినిమా తీశానని అభినందించినట్లు చెప్పాడు.
కథే ప్రధానంగా సినిమా తీశానని.. ఎక్కడా కమర్షియల్ హంగుల కోసం డీవియేట్ కాకుండా.. కథ మీదే సినిమా నడిపించానని త్రివిక్రమ్ ప్రశంసించినట్లు చెప్పాడు. ఒక తొలి చిత్ర దర్శకుడు సినిమా తీసినట్లుగా అనిపించలేదని కూడా త్రివిక్రమ్ అన్నట్లు తెలిపాుడ. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ గురించి కూడా త్రివిక్రమ్ పొగడ్తలు గుప్పించినట్లు వంశీ వెల్లడించాడు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తనను ఇలా పొగడ్డం గొప్ప అనుభూతినిచ్చిందని అతనన్నాడు. వక్కంతం లాంటి ఎంతోమందికి త్రివిక్రమ్ ఆదర్శంగా నిలిచాడు. ముందు రచయితగా ప్రస్థానం ఆరంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారి గొప్ప పేరు సంపాదించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ఈ కోవలో చాలామంది రచయితలు దర్శకులుగా మారారు. దాదాపుగా వంశీ కూడా త్రివిక్రమ్ తరహాలోనే ముందు రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. తొలి సినిమాలో ప్రతిభ చూపించిన వంశీ.. మున్ముందు ఎలాంటి చిత్రాలు అందిస్తాడో చూడాలి.