Begin typing your search above and press return to search.

నాన్నే సూపర్ హీరో... త్రివిక్రం చెప్పిన వాస్తవం!

By:  Tupaki Desk   |   8 April 2015 3:30 PM GMT
నాన్నే సూపర్ హీరో... త్రివిక్రం చెప్పిన వాస్తవం!
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నోట ఏమాట వచ్చిన, కల నుండి ఏ వాక్యం జాలువారినా అందులో చాలా అర్థం, లోతైన భావన ఉంటాయి అనడంలో ఎవరికీ సందేహం ఉందదు! ఈ సమయంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కథ మొత్తం తండ్రీ - కొడుకల మధ్యే ఉంటుంది అన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో... ప్రతి మనిషి జీవితంలో తండ్రి పాత్ర అనే అంశంపై మొన్న ఆడియో సక్సెస్ వేడుకలో, నిన్న చెన్నై లోనూ ఇదే అంశంపై మాట్లాడాడు. సాధారణంగా అందరు తమ తల్లి గురించే ఎక్కువ మాట్లాడుతారని కాని నాన్న విలువ గురించి తండ్రి చేసే త్యాగాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని అంటున్నారు త్రివిక్రం. ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి మనిషి తన తండ్రిని సూపర్ హీరోగా భావిస్తాడని... 10 ఏళ్ల వయస్సు వచ్చే సరికి నాన్న కన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని భ్రమపడి తండ్రి పై తనకు తెలియకుండానే అసంతృప్తి ఏర్పరచుకుంటాడని... తర్వాత 15 ఏళ్ళు వచ్చే సరికి నాన్నకు చాదస్తం ఎక్కువ అనిపించి చిన్నచిన్నగా నాన్నకు దూరం అవ్వడం ప్రారంభిస్తామని జీవితంలో జరిగే వాస్తవాలను, మనకు కూడా తెలిసిన విషయాలను తదైన శైలిలో చెబుతున్నారు! ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వ్యాఖ్యలు కొన్ని గంటలు తిరగ కుండానే ఈ సినిమా క్రేజ్ ని, అంచనాలని మరోసారి తార స్థాయికి తీసుకువెళ్లాయి!