Begin typing your search above and press return to search.
మిసెస్ త్రివిక్రమ్ షో సూపర్ హిట్
By: Tupaki Desk | 2 Feb 2019 12:08 PMదర్శకుడిగా త్రివిక్రమ్ టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ తాజాగా 'అరవింద సమేత' చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. త్వరలోనే అల్లు అర్జున్ తో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఒకవైపు దర్శకుడిగా స్టార్ హోదాతో దూసుకు పోతున్న త్రివిక్రమ్ ఈసారి తన భార్య వల్ల విజయానందాన్ని పొందుతున్నాడు. త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్ అనే విషయం చాలా మందికి తెలియదు. వ్యక్తిగత విషయాలను పెద్దగా షేర్ చేసుకునేందుకు ఇష్టపడని త్రివిక్రమ్ తన భార్య గురించి బయట ఎప్పుడు కూడా మాట్లాడడు.
త్రివిక్రమ్ భార్య గురించి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు పెద్దగా చర్చ జరిగింది లేదు. దాంతో ఆమె ఎవరు, ఏం చేస్తారనే విషయంపై ఎక్కువ మందికి అవగాహణ లేదు. అసలు విషయం ఏంటీ అంటే సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్ - ఆమె పెళ్లికి ముందు నుండే పలు ప్రదర్శణలు ఇచ్చారు. తాజాగా వైజాగ్ లో కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సౌజన్య తన నాట్య ప్రదర్శణ ఇచ్చారు.
సౌజన్య నాట్య ప్రదర్శణకు ఆమె అంకుల్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరియు త్రివిక్రమ్ తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. సౌజన్య నాట్య ప్రదర్శణ చాలా పెద్ద సక్సెస్ అయ్యిందని, ఆమె డాన్స్ కు ఆడియన్స్ మంత్ర ముగ్దులయ్యారంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వైఫ్ అయినా కూడా డాన్స్ పై అభిరుచితో సౌజన్య ఈ ప్రదర్శణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.