Begin typing your search above and press return to search.
శభాష్ గురూజీ..ఇది కదా కావాల్సింది!
By: Tupaki Desk | 24 Nov 2022 2:30 AM GMTస్టార్ హీరోతో సినిమా మొదటు పెట్టినా.. పెడుతున్న సమయం నుంచే స్టార్ డైరెక్టర్ లు తమ హీరో తో సన్నిహితంగా వుంటూ వారి ఫ్యామిలీ ఫ్రెండ్ లా వ్యవహరిస్తుంటారు. `మహర్షి` నుంచి వంశీ పైడిపల్లి .. మహేష్ తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అంతుకు ముందు ఇదే స్థాయి అనుబంధం త్రివిక్రమ్ - మహేష్ మధ్య కూడా మంచి అనుబంధం వుండేది. తన కోసమే మహేష్ `జల్సా`కు వాయిస్ ఓవర్ అందించడం తెలిసిందే.
మహేష్ తో త్రివిక్రమ్ `అతడు`, `ఖలేజా` వంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల తరువాత దాదాపు పుష్కర కాలం ఆనంతరం మహేష్ 28వ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. `ఖలేజా` తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరికి దాదాపు 12 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు.
అయితే సినిమా ప్రారంభించిన వేశా విశేషమో ఏమో కానీ మహేష్ కు వరుస బ్యాడ్ న్యూస్ లు వెంటాడుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని బ్రేక్ తీసుకున్న సమయంలో మహేష్ మదర్ ఇందిరా దేవి మృతి చెందడం.. ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడటం జరిగింది. ఆ తరువాత ముందు అనుకున్న స్టోరీని, షూట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ ని పక్కన పెట్టి కొత్త కథతో పాన్ ఇండియా స్టోరీతో చేయాలని త్రివిక్రమ్ మార్పులు చేశాడు.
ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ అకస్మాత్తుగా మృతి చెందడం తెలిసిందే. దీంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కాబోతోంది. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా సినిమా వర్క్ ని పక్కన పెట్టిన త్రివిక్రమ్ .. కృష్ణ చనిపోయిన దగ్గరి నుంచి మహేష్ కు అండగా వుంటూ వస్తున్నాడు. దహస సంస్కారాల తరువాత విజయవాడ కృష్ణా నదిలో కలపడానికి మహేష్ ఫ్యామిలీ వెళుతుంటే తన కూడా వెళ్లి ఓ స్నేహితుడికి అండగా వున్నట్టుగా సపోర్ట్ గా నిలిచాడు త్రివిక్రమ్.
ఇదంతా గమనించిన వాళ్లంతా శభాష్ గురూజీ .. ఇది కదా కావాల్సింది అంటూ త్రివిక్రమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత కొంత కాలంగా మహేష్ కు దూరమైన త్రివిక్రమ్ ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న నేపథ్యంలో తనకు తను కష్టాల్లో వున్న సమయంలో ప్రతి అడుగులోనూ అండగా వుంటూ తన స్నేహాన్ని చాటుకుంటుంటుండటం ఆకట్టుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.