Begin typing your search above and press return to search.
పవన్ తమిళ రీమేక్ కు త్రివిక్రమ్ సాయం..?
By: Tupaki Desk | 8 Feb 2022 8:57 AM GMTమామా అల్లుళ్ళు పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'వినోదయ సీతమ్' అనే తమిళ రీమేక్ లో వీరిద్దరూ నటించనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగు రీమేక్ లో పవన్ - సాయి తేజ్ నటిస్తున్నారని వార్తలు వస్తుండటంతో అందరిలో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.
'వినోదయ సీతమ్' తెలుగు రీమేక్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ మీద నిర్మిస్తారని తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ తో కలిసి నటిస్తున్న మాతృక డైరెక్టర్ సముద్రఖని.. ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం కానున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. పవన్ తో మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్.. ఆయన కోరిక మేరకు స్టార్ డైరక్టర్ గా కొనసాగుతున్నప్పటికీ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడానికి రెడీగా ఉంటారు.
గతంలో పవన్ కోసం 'తీన్ మార్' అనే రీమేక్ చిత్రానికి వర్క్ చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' అనే రీమేక్ చిత్రానికి స్క్రీన్ ప్లే - మాటలు సమకూర్చారు. అంతేకాదు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు 'వినోదయ సీత' రీమేక్ ను తెలుగు నేటివిటీకి.. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసే బాధ్యతను కూడా త్రివిక్రమ్ కు అప్పగించాలని అనుకుంటున్నారట.
'అల వైకుంఠపురములో' తర్వాత ఖాళీగా ఉండటం.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో త్రివిక్రమ్ 'భీమ్లా నాయక్' సినిమా కోసం పని చేయడానికి కుదిరింది. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో #SSMB28 సినిమాని ప్రారంభించారు త్రివిక్రమ్. ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏమాత్రం సమయం కేటాయిస్తారనేది చూడాలి.
ఇకపోతే 'వినోదయ సీతమ్' సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొన్నటిదాకా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారో.. యాప్ నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను తొలిగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి తెలుగులో సమర్పించనున్నారు. మరి త్వరలోనే మామా అల్లుళ్ళు పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ ల రీమేక్ అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.