Begin typing your search above and press return to search.
నీక్కూడా పబ్లిసిటీ కావాలా త్రివిక్రమ్?
By: Tupaki Desk | 16 Dec 2017 1:11 AM GMTఒక్కో దర్శకుడికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. అలాంటి వారిలో మనం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి పెద్దగా చెప్పుకోవక్కర్లేదు. ఎందుకంటే ఆయన పదునైన మాటలు.. చురకత్తుల లాంటి పంచులు.. అవన్నీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. కాని అటువంటి మెగా దర్శకుడు కూడా ఇప్పుడు తనకు సరైన బ్రాండింగ్ అండ్ ఇమేజ్ కావాలని ఆశిస్తున్నాడు అనుకోవాలి? పదండి ఈ కథేంటో చూద్దాం.
నిజానికి ఈ మధ్యన ఎప్పుడు 'అజ్ఞాతవాసి' సినిమా పోస్టర్లు రిలీజైన కూడా.. వాటితో పాటే కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. వాటిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రక్కనే నెరిసన గెడ్డంతో కూర్చున్న త్రివిక్రమ్ కూడా కనిపిస్తాడు. అదే తరహాలో మొన్నామధ్యన కంపోజర్ అనిరుధ్ #pspk మీద ప్రేమతో ఆయనకు ట్రిబ్యూట్ అంటూ ఒక వీడియోతో వచ్చాడు. గాలివాలుగా పాటకు ఒక దృశ్యరూపం ఇచ్చాడు. ఆ పాట చివర్లో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ వెనుకాలే త్రివిక్రమ్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. అలాగే రేపు జరగబోయే ఆడియో లాంచ్ దగ్గర త్రివిక్రమ్ కటవుట్స్ కూడా పెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు త్రివిక్రమ్ కు ఈ రేంజ్ పబ్లిసిటీ కావాలా అంటూ అడిగేవారూ లేకపోలేదు.
కాని వాస్తవం ఏంటంటే.. కష్టపడి కథలను రాసి.. మాటలను కూర్చి.. మొత్తం యునిట్ ను ఒక తాటి మీద నడిపించే డైరక్టర్ ను నిజానికి మన తెలుగు ఇండస్ర్టీ పెద్దగా గుర్తుపెట్టుకోదు. నటుల పేర్లు చిరకాలం నిలుస్తాయి కాని.. వారికి అద్భుతమైన ఆణిముత్యాల వంటి సినిమాలను ఇచ్చిన దర్శకులను ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. అందుకే త్రివిక్రమ్ వంటి దర్శకుడు బహుశా పబ్లిసిటీపై ఫోకస్ చేస్తున్నారేమో.