Begin typing your search above and press return to search.
SSMB 28: మహేష్ ను డిస్టర్బ్ చేయకుండ
By: Tupaki Desk | 29 Sep 2022 2:30 AM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ఇటీవల ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ముందస్తు ప్లాన్ ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా కఠినమైన సన్నివేశాలను ముందుగానే పూర్తి చేసుకుంటున్నాడు. అందుకే మొదటి షెడ్యూల్లో ఒక పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు.
అయితే ఇక సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాత మొదలుపెట్టాలని మరో ప్లాన్ అయితే రెడీ అయింది. అయితే ఇంతలోనే మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు అయితే తల్లి మరణం వార్తను తట్టుకోలేకపోతున్నాడు.
చిన్నప్పటి నుంచి తల్లి కంటే ఎక్కువగా తల్లితోనే తన సమయాన్ని ఎక్కువగా గడిపిన మహేష్ బాబు ఎంత కష్టం వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్లి ఒక చిన్న కప్పు కాఫీ తాగితే మాత్రం అంతా సెట్ అయిపోతుంది అని మహేష్ బాబు చాలాసార్లు చెప్పాడు. అయితే అలాంటి మాతృమూర్తి లేదు అంటే మాత్రం మహేష్ బాబు విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది.
ఇక ఈ తరుణంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. కావాల్సినంత టైమ్ తీసుకున్నా పరవాలేదు అని ముందుగానే తన టీమ్ కు ఇంటిమెట్ చేసినట్లు టాక్. అసలైతే సెకండ్ షెడ్యూల్ కోసం మరో రెండు మూడు రోజుల్లో చర్చలు జరపాలని కూడా అనుకున్నారు.కానీ మహేష్ బాబు ప్రస్తుత పరిస్థితులలో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితిలో అయితే లేడు.
అంతేకాకుండా కుటుంబ సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల తర్వాత కూడా కర్మ కు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా 15 రోజుల తర్వాత కూడా కుటుంబంలో కొన్ని ఆచారాలు ప్రకారం తల్లికి కడసారి వేడుకలు పలికే వారు కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
అందుకే దసరా తర్వాత కూడా మహేష్ బాబు మరో 15 రోజులపాటు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. ఇక ఈ లోపు SSMB28 కోసం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ లో ప్లాన్ ను మార్చనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.