Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ను భార్యతో చూస్తారా..?

By:  Tupaki Desk   |   28 April 2016 6:28 AM GMT
త్రివిక్రమ్ ను భార్యతో చూస్తారా..?
X
టాలీవుడ్ లో అత్యంత లోప్రొఫైల్ మెయింటైన్ చేసే దర్శకుల్లో ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పాలి. వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకోవడానికి కానీ.. తన కుటుంబ సభ్యుల్ని బయటికి తేవడానికి కానీ అస్సలు ఇష్టపడడు త్రివిక్రమ్. ఒకప్పుడు త్రివిక్రమ్ సైతం మీడియా ముందుకొచ్చేవాడు కాదు కానీ.. ఈ మధ్య తన సినిమాల ప్రమోషన్ కోసం తప్పక మాట్లాడుతున్నాడు. ఇక త్రివిక్రమ్ భార్యాపిల్లల గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. వాళ్లు మీడియాలో అస్సలు కనిపించరు.

ఐతే ఈ మధ్య అనుకోకుండా త్రివిక్రమ్, ఆయన భార్య పక్కపక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫొటో ఒకటి మీడియాలోకి వచ్చింది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. దిగ్గజ గీత రచయిత సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తే ఈ సౌజన్య. త్రివిక్రమ్ టాలెంట్ చూసి ఫిదా అయిపోయి సౌజన్యను ఇచ్చి పెళ్లి చేశారు సీతారామశాస్త్రి. త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారాక.. అతడు సినిమా మొదలుపెట్టడానికి ముందు 2004లో సౌజన్యను పెళ్లాడాడు. ‘జల్సా’ టైంలో త్రివిక్రమ్ కు భార్యతో కొంచెం విభేదాలు వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరిగింది కానీ.. వాళ్లిద్దరూ అన్యోన్యంగానే జీవనం సాగిస్తున్నారు.