Begin typing your search above and press return to search.

చిన్మయి ఇష్యూను మరింత సీరియస్‌ చేసింది

By:  Tupaki Desk   |   1 March 2019 1:15 PM GMT
చిన్మయి ఇష్యూను మరింత సీరియస్‌ చేసింది
X
బాలీవుడ్‌ లో మీటూ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైన సమయంలో దక్షిణాదిలో ఏమీ లేదులే అని అంతా భావించారు. కాని ఉత్తరాధిన ఉద్యమం ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సౌత్‌ లో ముఖ్యంగా తమిళ మరియు కన్నడ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం తాలూకు వేడి రాజుకుంది. తమిళనాట సింగర్‌ చిన్మయి మీటూ ఉద్యమంను మొదలు పెట్టింది. లెజెండ్రీ రచయిత వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసింది. తనను మాత్రమే కాకుండా ఎంతో మంది సింగర్స్‌ కూడా వైరముత్తు లైంగికంగా వేదించాడని, కొందరిని లోబర్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. తమిళ సినీ పరిశ్రహలో వైరముత్తుకు ఉన్న పేరుతో ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు.

వైరముత్తు పై కేసు నమోదు చేసేందుకు చిన్మయి ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. పైగా చిన్మయికి తమిళ సినీ పరిశ్రమ నుండి అనధికారిక బ్యాన్‌ ఎదురైంది. దాంతో పలు వేదికలపై, సోషల్‌ మీడియాలో చిన్మయి తన ఆవేదనను చెప్పుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ మరియు మేనకా గాంధీని తన ట్వీట్‌ లో ట్యాక్‌ చేయడం జరిగింది.

వైరముత్తు నుండి తాను ఇంకా పలువురు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారు, ఆయనపై కేసు నమోదు చేయడానికి పోలీసులు ఒప్పుకోవడం లేదు అంటూ చిన్మయి చేసిన ట్వీట్‌ కు మేనక గాంధీ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు తనకు కావాలని, ఈ విషయాన్ని గురించి జాతీయ మహిళ కమీషన్‌ ముందుకు కూడా తీసుకు వెళ్లాలని ఆమె భావిస్తుంది. జాతీయ మహిళ కమీషన్‌ ముందుకు కనుక ఈ ఇష్యూ వెళ్తే పరిస్థితి మరింత సీరియస్‌ అయ్యే అవకాశం ఉంది.

వైరముత్తు ను కాపాడేందుకు ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆయన విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ న్యాయనిపుణులు చెబుతున్నారు. చిన్మయి ఈ విషయాన్ని మరింత సీరియస్‌ చేస్తున్న నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆమెపై ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంతమంది వారించినా కూడా చిన్మయి మాత్రం ఈ విషయాన్ని తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం అయ్యింది.