Begin typing your search above and press return to search.

'డ్ర‌గ్స్ క్వీన్' అంటూ నిహారిక‌పై ట్రోల‌ర్స్ ఎటాక్!

By:  Tupaki Desk   |   4 April 2022 3:41 AM GMT
డ్ర‌గ్స్ క్వీన్ అంటూ నిహారిక‌పై ట్రోల‌ర్స్ ఎటాక్!
X
మెగా డాట‌ర్ నిహారిక పేరు ఇప్పుడు ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం సైతం గుప్పుమ‌న‌డంతో నిహారిక పేరు సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసు విష‌యంలో పోలీస్ స్టేష‌న్ నుంచి నిహారిక బ‌య‌ట‌కు వ‌స్తోన్న దృశ్యాలు ఇంకా ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ ఘ‌ట‌న జ‌రిగి కొన్ని గంట‌లు గ‌డుస్తున్నా డ్ర‌గ్స్ మూలాలు క‌నిపించ‌డంతో నే విష‌యం సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో త‌న కుమార్తె త‌ప్పు లేద‌ని ఇప్ప‌టికే మెగా బ్రద‌ర్ నాగ‌బాబు ఓ వీడియో రిలీజ్ చేసారు. దీంతో నిహారిక వ్య‌వ‌హారం స‌హ నాగ‌బాబు వీడియో ట్రోలింగ్ కి గురైంది. నిహారిక ను టార్గెట్ చేస్తూ '# డ్ర‌గ్ క్వీన్ నిహారిక' అనే హాష్ ట్యాగ్ ల‌ని జెటి జ‌నులు ట్వ‌ట‌ర్లో ట్రెండ్ చేస్తున్నారు. 'డ్ర‌గ్స్ నిహారిక కొణిదెల' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో నాగ‌బాబు వీడియోలో చేసిన వ్యాఖ్య‌ల్ని సైతం జోడిస్తున్నారు. తెల్ల వారే వ‌ర‌కూ ప‌బ్ ఓపెన్ చేసి ఉండ‌టం ప‌బ్బు నిర్వాహ‌కుల త‌ప్ప‌తే.. అర్ద‌రాత్రి 2 గంట‌ల‌కు దాకా నిహారిక ప‌బ్ లో ఉండ‌టం ఏంటి? అదీ వివాహం చేసుకున్న యువ‌తి !అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గ‌తంలో నిహారిక‌ను చూస్తే గ‌ర్వంగా ఉందంటూ నాగ‌బాబు చేసిన పాత‌ వ్యాఖ్య‌ల్ని ట్రోల‌ర్స్ త‌మ‌దైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.

నాగ‌బాబు ఇప్ప‌డింకా గ‌ర్వ‌ప‌డాల్సిన స‌మ‌యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి నాగ‌బాబు ధీటైన బ‌ధులిస్తున్నారు. త‌న కుమార్తె డ్ర‌గ్స్ క్వీన్ కాద‌ని..మెగా లిటిల్ ప్రిన్సెస్ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ని సైతం ట్రోల‌ర్స్ విడిచి పెట్ట‌లేదు. రేవ్ పార్టీలో 150 మంది ప‌ట్టుబ‌డినా ట్రోలర్స్ నిహారిక‌..రాహుల్ సిప్లిగంజ్ నే టార్గెట్ చేసారు. రాహుల్ ని సైతం ట్రోల‌ర్స్ విడిచిపెట్ట‌లేదు.

డ్ర‌గ్స్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న గాయ‌కుడు ఇప్పుడు ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డం రాహుల్ ని మ‌రింత ఇబ్బందుల్లోల‌కి నెట్టిన‌ట్లు అయింది. ఇద్ద‌రు సెల‌బ్రిటీల కావ‌డంతోనే ర‌చ్చ ఈ రేంజ్ లో జ‌రుగుతోంది.

ఇంకొంత మంది ప్ర‌ముఖుల పిల్లల పేర్లు ఉన్న‌ప్ప‌టికి అవి ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఎవ‌రికి వారు రేవ్ పార్టీతో మాకెలాంటి సంబంధం లేదంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.