Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ ను టార్గెట్ చేసిన ట్రోలర్లు
By: Tupaki Desk | 7 Jun 2019 9:09 AM GMTగ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా ఈమధ్య ఇన్ స్టైల్ అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఆమె రెండు మూడు రకాల దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంది కానీ అందరినీ ఎక్కువగా ఆకర్షించినది మాత్రం ఆమె బ్లౌజ్ లేకుండా చీర మాత్రమే ధరించిన ఫోటోలు. తళతళా మెరుస్తున్న చీర ధరించి హాట్ గా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఫోటో షూట్ పూర్తి చేసింది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫోటో షూట్ చేసినప్పుడు తీసిన వీడియో క్లిప్ బైటకు రావడంతో ట్రోలర్లు కూడా గట్టిగా తగులుకున్నారు.
"ఇండియన్ శారీ కి ఖర్మ పట్టింది" అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు "బ్లౌజ్ ను ఇంట్లో మర్చిపోయి వచ్చింది" అన్నారు. కొందరైతే వల్గర్ గా ఉంది అని.. తాగి ఫోటో షూట్ చేసిందని అన్నారు. ఒకరు "కుచ్ తో షరమ్ కరో ప్రియాంక" అన్నారు. "శారీ కట్టుకున్నట్టు లేదు.. విప్పుతున్నట్టు ఉంది" అని ఇంకొకరు ఘాటుగా కామెంట్ చేశారు. ప్రియాంకకు ఈ ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కొద్దిరోజుల క్రితం మెట్ గాలాలో థీమ్ కు తగ్గట్టు ఒక పిచ్చాతిపిచ్చ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ దెబ్బకు కామన్ నెటిజనుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ డ్రెస్ ను అర్థం చేసుకోగల మేథావులు.. సామాజిక తత్వవేత్తలు తప్ప మామూలు జనాలు ప్రియాంకపై తిట్లు లంకించుకున్నారు. ఇప్పుడు మరీ అంత దారుణంగా లేదు కానీ ఇదో రకమైన ఇస్టైలు. పట్టించుకుంటే మనసుకు కష్టంగా ఉంటుంది. లేకపోతే ఏదో హాటు డ్రెస్ అని సరిపెట్టుకోవచ్చు!
అదేంటో కానీ ప్రియాంక మంచి డ్రెస్ వేసుకున్నా.. తేడాగా ఉన్న డ్రెస్ వేసుకున్నా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. చర్చోపచర్చలు సాగుతాయి. కొందరు పొగుడుతారు. కొందరు విమర్శిస్తారు.. కొందరు ఖండిస్తారు. ఈసారి కూడా అంతే. ప్రపంచవాప్తంగా మరోసారి 'ఇండియన్ హాట్ శారీ' హాట్ టాపిక్ అయింది. ప్రియాంక ఆ చీరను కట్టుకున్నట్టు ఎంతమంది మిగతా అంతర్జాతీయ భామలు కట్టుకుంటారో చూడాలి.