Begin typing your search above and press return to search.

#ట్రోలింగ్‌: నాడు ఐశ్వ‌ర్యారాయ్.. నేడు దీపిక ప‌దుకొనే

By:  Tupaki Desk   |   25 Jan 2022 7:30 AM GMT
#ట్రోలింగ్‌: నాడు ఐశ్వ‌ర్యారాయ్.. నేడు దీపిక ప‌దుకొనే
X
ఒక‌ప్పుడు ఎఫైర్ కొన‌సాగించే క‌పుల్స్ ని ఎంపిక చేసుకునేందుకు బాలీవుడ్ మేక‌ర్స్ ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రిచేవారు. పెద్ద‌తెర‌పై కెమిస్ట్రీ అద్భుతంగా పండాలంటే ఇదొక్క‌టే మార్గం. అందువ‌ల్ల అప్ప‌టికే ప్రేమ‌లో పడి ప‌బ్లిక్ లో పాపుల‌రైన జంట‌ల్ని వెతికేవారు. కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏవీ లేవు. పెళ్ల‌యిన హీరోయిన్ తో హీరో మారినా ఇప్పుడు అది స‌హ‌జ ప్ర‌క్రియ‌. రొమాన్స్ కి హ‌ద్దులేవీ ఉండ‌వు. నో రూల్స్.. నో బౌండ‌రీస్.. ఇదీ లేటెస్ట్ ట్రెండ్.

అప్ప‌టికే పెళ్ల‌యినా కానీ పెద్ద తెర‌పై ఘాటైన చుంబ‌నాలు బెడ్ రూమ్ స‌న్నివేశాల‌కు అభ్యంత‌రం చెప్ప‌క‌పోతే ఓకే. తాజాగా దీపిక ప‌దుకొనే హ‌ద్దులు చెరిపేసిన చుంబ‌నాలు బెడ్ రూమ్ యాక్ట్ తో ఓటీటీ మూవీ `గెహ్ర‌యాన్` నుంచి `దూబే` సాంగ్ వైర‌ల్ గా మారింది. దీనిపై నెటిజ‌నుల ట్రోల్స్ అసాధార‌ణంగా ఉన్నాయి. కోస్టార్ సిద్ధాంత్ తో దీపిక ఒక రేంజులో చుంబనాల్లో మునిగి తేలింది. ఓటీటీలో వీక్షించిన వారికి ఆవిరులు పుట్టుకురావ‌డం ఖాయం.

అయితే ఇది కేవ‌లం దీపిక‌కు మాత్ర‌మే కాదు.. ఇంత‌కుముందు ఐశ్వ‌ర్యా రాయ్ సైతం ధూమ్ 2లో హృతిక్ రోష‌న్ తో ఘాటైన రొమాన్స్ చేసింది. అప్పుడు ఐష్ అభిమానులు అంతే ఇదిగా ట్రోల్స్ చేశారు. ఇదే విష‌య‌మై అత్త‌మామ‌లైన అమితాబ్ - జ‌యాబ‌చ్చ‌న్ అభ్యంత‌రం చెప్పార‌ని అభిషేక్ ఇంట్లో గొడ‌వ‌ల‌య్యాయ‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు దీపిక‌కు భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ నుంచి బోలెడంత స‌పోర్ట్ ఉంది. గెహ్ర‌యాన్ ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్ ని వీడియోల్లో ఘాటైన రొమాన్స్ ని చూసినా కానీ ర‌ణ‌వీర్ దానికి ఏమంత ఫీల్ కాలేదు. సినిమా అనేది విజువ‌ల్ మీడియం. క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజీ. ఆడియెన్ ని మెప్పిస్తేనే ఇక్క‌డ మ‌నుగ‌డ‌. అందువ‌ల్ల కొన్నిటికి రూల్స్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఇపుడు దీపిక కానీ ఇంత‌కుముందు ఐశ్వ‌ర్యారాయ్ కానీ చేసింది అదే. కానీ అది అర్థం చేసుకోవ‌డాన్ని బ‌ట్టి ఉంటుంది.

క్యూరియ‌స్ ఆల్బ‌మ్ దూబే

అమెజాన్ ఒరిజినల్ మూవీ గెహ్రైయాన్ సౌండ్ ట్రాక్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్బమ్ లలో ఒకటి. టీజర్ లో రివీల్ అయిన సినిమా టైటిల్ ట్రాక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ట్రైలర్ లో ప్రదర్శించిన ‘దూబే’ ఫోటోల బంచ్ ప్రేక్షకులను మరింత కోరుకునేలా చేసింది. దూబే .. గెహ్ర‌యాన్ నుండి మొదటి పాట. కౌసర్ మునీర్ లిరిక్స్ అందించ‌గా.. లోతిక ఝా పాడారు. OAFF - సవేరా దూబేకు సంగీతం కంపోజ్ చేసారు. అంకుర్ తివారీ రూపొందించారు.