Begin typing your search above and press return to search.
హీరోకంటే ముందే ట్రోలింగ్? ప్రచారం కలిసొచ్చేను!
By: Tupaki Desk | 20 Sep 2022 11:12 AM GMTబుల్లి తెర మెగాస్టార్ గా పాపులర్ అయిన ప్రభాకర్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో సీరియళ్లు..టీవీ షోలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. కొన్నాళ్ల పాటు బుల్లి తెరని ఏలిన నటుడు. కాలక్రమంలో ప్రభాకర్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ విధానంలోనూ ఎన్నో మార్పులు సహా కొత్త వాళ్ల నుంచి తీవ్రమైన పోటీతో ప్రభాకర్ వెనుకబడ్డారు.
కానీ తనయుడ్ని మాత్రం వెండి తెరపై పెద్ద స్టార్ గా చూడాలనుకున్నారు. అందుకే యాక్టింగ్ సహా అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇప్పించి నటుడిగా పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవలే కుమారుడు చంద్ర హాసన్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు మీడియాకి పరిచయం చేసారు. తనయుడి గురించి మీడియా ముఖంగా తాను చెప్పాలనుకున్నది అంతా చెప్పారు.
మీడియా సహా ప్రేక్షకుల ఆశీర్వచనాలు బిడ్డకు అవసరమని విజ్ఞప్తి చేసారు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో చంద్ర హాస్ యాటిట్యూడ్ పై నెట్టింట ట్రోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. నూనుగు మీసాల కుర్రాడ్ని నెటి జనులు గట్టిగానే టార్గెట్ చేసేసినట్లు కనిపిస్తుంది. యువ నటుడు నడుచుకున్న విధానాన్ని ఉద్దేశిస్తూ మీమ్స్ చేస్తున్నారు.
తేడా జరిగితే సీనియర్ స్టార్లే ట్రోలర్స్ బారిన పడు తున్నారు. అలాంటింది చంద్ర హాస్ పై ట్రోలింగ్ అన్నది పెద్ద విషయం కాదు. నెట్టింట ఇవన్నీ సహజంగా జరిగేవే. చంద్రహాస్ కి టాలీవుడ్ లో బొలెడంత భవిష్యత్ ఉంది. నటుడిగా ఎదగడానికి మంచి స్కోప్ ఉంది. ప్రతిభావంతులకు టాలీవుడ్ అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తుంది. ఆ కోవలో చంద్ర హాస్ నిలుస్తాడా? లేదా? అన్నది చూడాలి.
తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో చంద్ర హాస్ ప్రభాకర్ అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. పుత్రం పెద్ద రత్నం అవుతుందని డాడ్ చాలా ఆశలతో ఉన్నారు. తాను హీరోగా రాణించలేకపోయినా కుమారుడ్ని అయినా పెద్ద హీరోని చేయాలని కసి పట్టుదలతో లాంచ్ చేసారు.
మరి చంద్రహాస్ ఏ మేర మెప్పిస్తాడో చూడాలి. ఈ యువ నటుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాడు. ఇన్ స్టా..ఫేస్ బుక్...ట్విటర్లో కొత్త ఫోటోలో బాగానే ఆకట్టుకుంటున్నాడు. తాజా ట్రోలింగ్ యంగ్ హీరోకి పాపులర్ అవ్వడానికి ఉపయుక్తంగానే ఉంటుంది. అతనెవరో? తెలియడానికి ఛాన్స్ ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.