Begin typing your search above and press return to search.
ఎందుకొచ్చిన తిప్పలు దేవీ?
By: Tupaki Desk | 30 March 2019 5:52 AM GMTసాధారణంగా సంగీత దర్శకులు ఎంత గొప్పవారైనా వారి గాత్రం అదే స్థాయిలో ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అంత పెద్ద ఇళయరాజా వెయ్యి సినిమాలు పూర్తి చేసినా ఆయన స్వంతంగా పాడుకున్న వాటి కన్నా ఎస్పి బాలు తదితరులతో చేయించినవె గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. మణిశర్మకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆయన ఏ ఒక్క పాట పాడలేదంటే నమ్మగలమా. కాని అదే నిజం.
కీరవాణి కోటిలు సింగర్లే అయినప్పటికీ ఈ విషయంలో వాళ్ళ రీచ్ చాలా తక్కువ. ఒక దశలో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ రొటీన్ అనిపించడానికి కారణం అన్ని పాటలు ఆయనే పాడుకోవడమే అని ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ అంటారు. దేవి శ్రీ ప్రసాద్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది
నిన్న విడుదలైన మహర్షి ఫస్ట్ సింగల్ చోటి చోటి బాతే సోషల్ మీడియాలో ట్రాలింగ్ కు గురవుతోంది. కారణం ఇది దేవినే పాడటం. ఏదైనా హుషారైన బీటున్న పాటలకు దేవి గొంతు బాగుంటుంది కాని స్నేహం మీద కంపోజ్ చేసిన ఇలాంటి స్వీట్ మెలోడీస్ కి అంతగా సింక్ అవ్వదు. అందుకే సూపర్ చార్ట్ బస్టర్ గా నిలవాల్సిన పాట కాస్తా జస్ట్ యావరేజ్ గా మిగిలే ప్రమాదం ఉందని సంగీత ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవి వాయిస్ నిజంగానే ఇలాంటి పాటల్లో రొటీన్ ఫ్లేవర్ ఇస్తోంది. భరత్ అనే నేను టైటిల్ సాంగ్ తరహాలో ఇదీ వేరే వాళ్ళతో పాడించి ఉంటే ఎఫెక్ట్ ఇంకోలా ఉండేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. అయినా సింగర్స్ కి లోటు ఉంటే ఇలా చేయాలి కాని ఆ కొరత లేనప్పుడు ఎందుకొచ్చిన ప్రయోగాలు దేవి ఇవన్ని అనేది జనాల అభిప్రాయం