Begin typing your search above and press return to search.
దిషా ఘటనపై మీకు మాట్లాడే అర్హత లేదు!
By: Tupaki Desk | 7 Dec 2019 5:30 PM GMTదిషా సంఘటనపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మొత్తం స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా దిషా నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ సెలబ్రెటీలు అంతా కోరారు. అంతా కోరుకున్నట్లుగానే దిషా నిందితులకు శిక్ష పడింది. పోలీసుల ఎన్ కౌంటర్ లో వారంతా కూడా మృతి చెందిన విషయం తెల్సిందే. పోలీసుల తుపాకీ తీర్పుకు చాలా మంది సెల్యూట్ చేస్తున్నారు.
తెలంగాణ పోలీసులు చేసిన పనికి సెల్యూట్ అంటూ చాలా మంది మాదిరిగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ట్వీట్ చేశాడు. మీరు నిజమైన హీరోలు.. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చినప్పుడు పోలీసులు వస్తారు. దేవుడు వారిని పంపిస్తాడంటూ కాస్త ఎమోషనల్ గా పూరి ట్వీట్ చేశాడు. అయితే పూరి ట్వీట్ కు కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. నీ సినిమాలో హీరోయిన్స్ ను హీరోలు వేదించడం.. విలన్స్ అమ్మాయిలను క్రూరంగా చంపేయడం వంటివి చాలా కామన్ గా చూపిస్తావు. నీలాంటి వారి సినిమాల వల్లే దిషాలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
మీరు చేసే ప్రతి సినిమాలో కూడా అమ్మాయిలను ఏడిపించడం లేదంటే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయించడం చేస్తూ ఉంటారు. మీరు అలాంటివి చేసుకుంటూ దిషా నిందుతులకు శిక్ష పడటం గొప్ప విషయం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు మీరు దిషా సంఘటన గురించి మాట్లాడేందుకు అర్హులు కారు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాని ఎక్కువ శాతం మంది మాత్రం పూరి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు.