Begin typing your search above and press return to search.
'ఏజెంట్' లక్ పై అప్పుడే కాపీ ముద్ర!
By: Tupaki Desk | 30 May 2022 4:29 AM GMTఅక్కినేని అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఏజెంట్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అఖిల్ లుక్ ఎంతో ఎగ్జైట్ మెంట్ ని తీసుకొస్తుంది. అఖిల్ డిఫరెంట్ ప్రెష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. హీరోని తనదైన మార్క్ స్టైలిష్ ఎలివేషన్లతో సూరి హైలైట్ చేయబోతున్నారు.
అందుకోసం లుక్ పరంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసి రంగంలోకి దిగారు. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా మంచు కొండ గుట్టల్లోకే వెళ్లిపోయారు. మనాలీ మంచు పర్వాతాల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూట్ లో భాగంగా అఖిల్ కి చిన్నపాటి గాయాలు సైతం తగిలాయి. ముఖంపైనా బుగ్గలపైనా అక్కడక్కడా గాట్లు కనిపించాయి.
యాక్షన్ సన్నివేశంలో ఏజెంట్ చాలా రిస్క్ చేసినట్టే కనిపిస్తుంది. ఏజెంట్ మూవీ కోసం అఖిల్ శ్రమిస్తున్న తీరు చూస్తుంటే యాక్షన్ హీరోయిజాన్ని మరో లెవల్లో చూపిస్తున్నారని అర్థమవుతోంది. అఖిల్ మాన్ స్టర్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాహసాలు థ్రిల్స్ తో సాగే స్పై కాన్సెప్ట్ కావడంతో అంతకంతకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
తాజాగా అఖిల్ కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. యువ హీరో డబుల్ జాకెట్ ధరించి మంచు కొడల్లో తీక్షణంగా చూస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో పర్వతాలు.. గిరజాల పోనీ టెయిల్ తో అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లోని జోన్ స్నోని గుర్తు చేస్తున్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ని హీరో కూడా ఇలాంటి లుక్ లోనే మంచు పర్వతాల్లో కనిపిస్తాడు.
చిన్నపాటి మార్పులు తప్ప లుక్ లో పెద్దగా తేడాలేవని టాక్ వినిపిస్తుంది. దీంతో 'ఏజెంట్' జోన్ స్నోని కాపీ కొడుతున్నాడా? అన్న సందేహం తెరపైకి వస్తుంది. నెట్టింట రెండు ఫోటోలు జతచేసి సేమ్ టూ సేమ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లొకేషన్ పరంగా ఒకే విధంగా ఉండటమే ఇంతగా హైలైట్ అవుతుంది. లుక్ పరంగా చూస్తే చాలా మార్పులు గమనించవచ్చు. హెయిర్ దగ్గర నుంచి ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్.. డిజైన్ అంతా ఫ్రెష్ ఫీల్ నే తీసుకొస్తుంది.
ఈ లుక్ అంత వీజిగా దొరికేది కాదు. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఎక్కువ మంది ఆ సిరీస్ ని వీక్షించారు. దీంతో హీరోగా బాగా సుపరిచితుడయ్యాడు. ఆ కారణంగానే ఇలా కాపీ క్యాట్ అనే ముద్రని ఏజెంట్ పై పడుతుంది. మరి దీనికి సూరి ఎలాంటి బధులిస్తారో చూద్దాం.
ఇందులో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అన్ని పనులు పూర్తిచేసి ఆగస్ట్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు