Begin typing your search above and press return to search.

అలియా భ‌ట్ పై ట్రోల్స్‌.. పొగుడుతూనే తిడుతున్నారు!

By:  Tupaki Desk   |   20 April 2022 7:30 AM GMT
అలియా భ‌ట్ పై ట్రోల్స్‌.. పొగుడుతూనే తిడుతున్నారు!
X
బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భ‌ట్ గ‌త వార‌మే ప్రియుడు, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఐదేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 14న పెళ్లి పీట‌లెక్కి అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ బాంద్రాలోని వాస్తులో వీరి వివాహం కోలాహలంగా జ‌రిగింది. ఇప్ప‌టికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.

దీంతో చూడముచ్చటైన ఈ జంటకు అభిమానులు, సినీ తార‌లే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున విషెస్ తెలిపారు. ఇక వివాహం త‌ర్వాత తొలిసారి అలియా భ‌ట్ ముంబైలోని కలీనా విమానాశ్రయంలో నిన్న దర్శనమిచ్చింది.

పింక్ సల్వార్ సూట్ లో చాలా అందంగా మెరిసిపోతూ కొత్త పెళ్లి కూతురు క‌నిపించ‌డంతో.. అక్క‌డ ఉన్న‌ కెమెరామెన్స్‌ ఆమె ఫొటోల‌ను క్లిక్ మ‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌గా.. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

అయితే ఇప్పుడు ఈ ఫొటోలే ఆమెపై ట్రోల్స్ కు కార‌ణం అయ్యాయి. అలియా భ‌ట్ తాజా ఫొటోలను చూసిన నెటిజ‌న్లు.. ఓవైపు ఆమె అందాన్ని పొగుడుతూనే, మ‌రోవైపు సంప్రదాయాలను పాటించ‌డం లేద‌ని తిడుతున్నారు.

పెళ్లి తర్వాత అలియా మ‌రింత అందంగా క‌నిపిస్తోంది.. కానీ, నుదుట సింధూరం, మెడలో మంగళ సూత్రం ఉండుంటే ఇంకా అందంగా క‌నిపించేది అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రైతే `వారం క్రితం పెళ్లైంది. నుదుట సింధూరం ఎక్కడ? మెడలో మంగళ సూత్రం ఏది? క‌నీసం చేతికి గాజులు అయినా వేసుకోవ‌చ్చుగా` అంటూ ట్రోల్ చేస్తున్నారు.

కాగా, అలియా భ‌ట్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లె ఈ బ్యూటీ `ఆర్ఆర్ఆర్‌` మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం రణ్‌వీర్ సింగ్‌ తో `రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ` లో న‌టిస్తోంది. అలాగే అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త ర‌ణ్‌బీర్ తో కలిసి ఈమె చేసిన `బ్రహ్మాస్త్ర` చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.