Begin typing your search above and press return to search.
అనుపమ కుమార్తె అయితే కుర్రాళ్లందరికీ అరవింద్ మావయ్య!
By: Tupaki Desk | 26 Dec 2022 4:44 AM GMTఇండస్ర్టీలో హీరోయిన్లును కుమార్తెలుగా...చెల్లెళ్లుగా..అక్కలుగా ట్రీట్ చేయడం అన్నది అసాధ్యం. ఇక్కడ లెక్క వేరేలా ఉంటుంది. ఇండస్ర్టీ నుంచే మీటూ ఉద్యమాలు మొదలయ్యాయంటే? ఇక్కడ సన్నివేశం ఎలా ఉంటుందన్నది అద్దం పడుతుంది. ఇండస్ర్టీని ఉద్దేశించి ఆరోపణలు చేసిన నటీమణులెంతో మంది ఉన్నారు. ఆ నిర్మాత ఇలా అన్నాడు..అలా అన్నాడు. ఫలానా నిర్మాత కమిట్ మెంట్ అడిగాడు.
దర్శకులపైనా ఎప్పటికప్పుడు లైంగిక ఆరోపణలు తెరపైకి వస్తూనే ఉంటాయి. తరుచూ ఇలాంటివి బాలీవుడ్ లో ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. టాలీవుడ్ లోనూ చిలవలు ఫలవులుగా ఇలాంటి విషయాలపై కొంత నెగిటివిటీ ఉంది. అవన్నీ పక్కనబెడితే హీరోయిన్లను కూడా కుమార్తెల్లా భావించే నిర్మాతలు ఉన్నారని అల్లు అరవింద్ లాంటి వాళ్లని చూస్తేనే గుర్తొస్తుంది.
ఇప్పటికే ఆయన మాటల సందర్భంలా కుమార్తె పుడితే నీలా ఉండేదేమో అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా '18 పేజీస్' సినిమా వేడుక సందర్భంగానూ మరోసారి ఇదే మాటను గుర్తు చేసుకున్నారు. దీనికి అనుపమ ఎంతో సంతోష పడింది. అరవింద్ హగ్ చేసుకుని సంబరపడింది. తాను మెచ్చిన ఓ గొప్ప నిర్మాతగా ట్రీట్ చేసింది.
ఇద్దరు రియల్ తండ్రీకూతుళ్లు కాకపోయినా వేదకపై కాసేపు మాత్రం అలాగే అనిపించింది ఆ ఇద్దరిని చూస్తే! కానీ ఈ సన్నివేశం చూసి కుర్రాళ్లు మాత్రం పెద్ద పండగే చేసుకున్నారు. అరవింద్ నోట కుమార్తె అన్న మాట బయటకు వచ్చిందో? లలేదో? వెనుక నుంచి ఒకరు అరవింద్ మావయ్య అంటూ బిగ్గరగా అరిచాడు.
అది చూసి మిగతా కుర్రాళ్లాంతా అరవింద్ మావయ్య అంటూ కేకలు అందుకున్నారు. దీంతో వేదిక ఒక్కసారిగా మాయవ్య..మావయ్య అంటూ దద్దరిల్లింది. ఈ సన్నివేశం చూసి అరవింద్ ఎంతో సంతోష పడ్డారు. ఆయన పగలబడి నవ్వారు. ఇక అనుపమ ఆనందానికైతే అవధుల్లేవ్. సిగ్గులొలికించి తెగ సంతోష పడింది. ఇక కుర్రాళ్లు వేసిన జోక్ పాతతే అయినా వేదికపై బాగానే పేలింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.