Begin typing your search above and press return to search.

ఒంటిపై నిలువ‌ని దుస్తుల్లో ఇబ్బంది దేనికీ?

By:  Tupaki Desk   |   3 July 2022 4:46 AM GMT
ఒంటిపై నిలువ‌ని దుస్తుల్లో ఇబ్బంది దేనికీ?
X
ఆ డ్రెస్సు ఒంటిపై నిలువ‌నంటోంది! అటూ ఇటూ క‌దిలేందుకు ఏమాత్రం ఛాన్సివ్వ‌నంటోంది! కానీ త‌ప్ప‌దు ఆ డిజైన‌ర్ డ్రెస్ తోనే పార్టీకి అటెండ‌వ్వాలి. పాపం అలా ఆప‌సోపాలు ప‌డుతూనే పార్టీకి అటెండ‌య్యింది. అలా కిందికి వాలిందో లేదో అలా అందాల‌ను కాచుకోవాల్సి వ‌చ్చింది. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీనిపై నెటిజ‌నులు కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అలా జార‌విడిచే దుస్తుల్లో క‌నిపించ‌డ‌మెందుకు? అంత‌గా ఇబ్బంది ప‌డ‌డం ఎందుకు? అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో నటీమ‌ణి ఎవ‌రు? అంటే సుశాంత్ సింగ్ మాజీ ప్రేయ‌సి అంకిత లోఖండే.

హిందీ సీరియల్ నటి అంకితా లోఖండే తనదైన‌ నటన అందంతో బోలెడంత పాపుల‌రైంది. సుశాంత్ సింగ్ తో పాటు స‌మాంత‌రంగా బుల్లితెర‌పై కెరీర్ సాగించిన ఈ బ్యూటీ అత‌డితో చాలా కాలం ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణంలో అత‌డి కుటుంబానికి అండ‌గా నిలిచింది అంకిత‌.

అంకితా లోఖండే ఇటీవ‌ల ఓ అవార్డు కార్యక్రమానికి వ‌చ్చి సూట్ కాని డిజైన‌ర్ డ్రెస్ లో చాలా ఇబ్బందులు ప‌డింది. ఆల్మోస్ట్ అందాల‌న్నీ బ‌య‌ట‌ప‌డేలా ఆ మిరుమిట్ల డిజైన‌ర్‌ డ్రెస్ ని డిజైన్ చేసారు. ఇక థై స్లిట్ ఎలివేష‌న్ తో సీక్విన్ గ్రీన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. మెరుపుల‌ స్ట్రాప్ హీల్స్.. బ్లూ చెవిపోగులతో అద‌న‌పు హంగుల్ని ఈ లుక్ కి జోడించింది. అంకిత తన భర్త విక్కీ జైన్ తో కలిసి ఈవెంట్ లో సంద‌డి చేసారు. అతను క్లాసిక్ బ్లాక్ సూట్ - వైట్ షర్ట్ ధరించాడు. అయితే అంకిత కారు దిగుతున్నప్పుడు అలా వంగిన‌ప్పుడు తన చేతితో అందాల‌ను క‌వ‌ర్ చేయాల్సి వ‌చ్చింది. ఆ తర్వాత రెడ్ కార్పెట్ మీద కూడా బాడీ హగ్గింగ్ డ్రెస్ లో సౌక‌ర్యంగా కనిపించలేదు. దీంతో ఇలాంటి అసౌకర్యమైన దుస్తులు ఎందుకు ధరించాల్సి వచ్చింది? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.

అంకిత బుల్లితెర‌పై బిజీ న‌టి. పెద్ద తెర అవ‌కాశాల‌ను అందుకుంటోంది. మ‌రోవైపు టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ లోనూ న‌టిస్తూ భారీగా ఆర్జిస్తోంది. అంకిత లోఖండే ఇటీవ‌లే త‌న భ‌ర్త‌తో క‌లిసి ఒక కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేసింది. టీవీ న‌టీమ‌ణుల్లోనే అత్యంత‌ ఖ‌రీదైన విల్లా క‌లిగిన న‌టిగా అంకిత పేరు వినిపిస్తోంది.