Begin typing your search above and press return to search.

త‌న కోప‌మే త‌న శ‌త్రువు అయ్యిందా?

By:  Tupaki Desk   |   24 Dec 2019 5:30 PM GMT
త‌న కోప‌మే త‌న శ‌త్రువు అయ్యిందా?
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌పై గ‌త కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఆయ‌న మేక‌ప్ - కాస్ట్యూమ్స్ విష‌యంలో ప‌ర్ఫెక్ష‌న్ లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లే వెల్లువెత్తాయి. మొన్న‌టికి మొన్న రూల‌ర్ చిత్రంలో ఆయ‌న లుక్ పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తాయి. ఎందులోనూ ప‌ర్ఫెక్ష‌న్ లేదంటూ నెటిజ‌నులు దుమ్మెత్తి పోశారు. అయితే దేనికీ ఆయ‌న నుంచి స‌రైన వివ‌ర‌ణ లేదు. అయితే త‌న లుక్ పై ట్రోల్స్ రావ‌డానికి కార‌ణాల‌పైనా తాజాగా ఓ కొత్త రూమ‌ర్ షికారు చేస్తోంది.

బాల‌య్య‌బాబు స్వ‌త‌హాగానే జోవియ‌ల్ గా ఉంటారు. స్టాఫ్ తోనూ చిన్న పిల్లాడిలా క‌లిసిపోతార‌ని చెబుతుంటారు. కానీ అందుకు పూర్తి విరుద్ధ‌మైన సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. బాల‌య్య‌ ఎందుక‌నో ఆయ‌న వ్య‌క్తిగ‌త స్టాఫ్ పై చూపించే కోప‌మే త‌న‌కు శ‌త్రువు అవుతోంద‌ని అందువ‌ల్ల‌నే మేక‌ప్ విష‌యంలో ఫెయిల్యూర్ ఎదురైంద‌ని ఓ ప్ర‌చారం సాగుతోంది.

ఎన్బీకే త‌న తండ్రి గారైన ఎన్టీఆర్ తో పోలిస్తే ఎంతో వైవిధ్యంగా ఉంటార‌ని.. ఎన్టీఆర్ కెరీర్ ఆద్యంతం పీతాంబ‌రం మేక‌ప్ మేన్ గా కొన‌సాగితే ఎన్బీకే విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు మేక‌ప్ మేన్స్ మారుతుంటార‌ని తెలుస్తోంది. ప్ర‌తిసారీ మేక‌ప్ మేన్ ని మార్చేస్తుండ‌డం.. అలాగే త‌న విగ్ ఎలా ఉండాలి? మేక‌ప్ ఎలా ఉండాలి? అన్న‌ది త‌న సెల‌క్ష‌నే కావ‌డం కూడా ఈ విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోందిట‌. అంతేకాదు.. మేక‌ప్ మేన్ అభిప్రాయానికి ఆయ‌న‌ ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌రని.. ఆయ‌న కోపాన్ని త‌ట్టుకోలేక అంద‌రూ సైలెంట్ అయిపోతార‌ని ఒక రూమ‌ర్ బ‌లంగా వినిపిస్తోంది. ఇక త‌న విగ్ సెల‌క్ష‌న్ కోసం బాల‌య్య ఏకంగా లండ‌న్ వెళ్లి వ‌స్తుంటార‌ట‌. లోక‌ల్ గా ఏదీ ప్రిఫ‌ర్ చేయ‌రు స‌రిక‌దా.. ప్ర‌తిసారీ మేక‌ప్ మేన్ ఛేంజ్ అవ్వ‌డం అన్న‌ది లుక్స్ పై ప్ర‌భావం చూపిస్తుంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది ఆయ‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇది రూమ‌ర్ అని ఖండిస్తారేమో చూడాలి.