Begin typing your search above and press return to search.
దించక్ పూజ కొత్త పాట...ఓ రేంజ్ లో ట్రోలింగ్
By: Tupaki Desk | 16 Oct 2020 5:45 PM GMTధించక్ పూజ...సోషల్ మీడియా...యూట్యూబ్ లతో టచ్ ఉన్నవారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తన కర్ణకఠోరమైన కంఠంతో....అడ్డదిడ్డమైన స్టెప్పులతో నెటిజన్ల ట్రోలింగ్ కు బలయ్యే ధించక్ పూజ....ఎప్పటికప్పుడు కొత్త పాటలతో సరికొత్తగా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. తనపై విపరీతమైన ట్రోలింగ్,కామెంట్లు, సెటైర్లు పేలుతున్నా...పూజ మాత్రం నెగెటివిటీతోనే యూ ట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. ‘కరోనా కరోనా… కామ్ ఏ కరోనా’ అంటూ కొద్ది రోజుల క్రితం కరోనాకే కంగారెత్తించిన దించక్ పూజ వీడియో వైరల్ అయింది. డాక్టర్ల గెటప్ వేయించిన టీంతో దించక్ పూజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పూజ ఎంత పిచ్చిగా స్టెప్పులేసినా....ఆ పాట మాత్రం ఏదోరకంగా వైరల్ అవుతోంది. ఈ ఊపుతోనే దించక్ పూజ నెటిజన్ల మీదకి మరోసారి తన పాటతో దండయాత్రకు వచ్చింది. అక్టోబర్ 9న ‘రోజ్ రోజ్ కా కామ్’ అంటూ తన కర్ణ కఠోరమైన గొంతును మరోసారి సవరించింది దించక్ పూజ.
ఈ వైరల్ స్టార్ పాటపై ట్విటర్ లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దించక్ పూజ పాట వచ్చేసింది....మీ చెవులు భద్రంగా ఉంచుకోండి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దించక్ పూజ పాట విన్న తర్వాత ఈ గ్రహం మీద ఉండనంటూ పీకేలో అమీర్ ఖాన్ వెళ్తున్న ఫొటో పెట్టి కొందరు నెటిజన్లు మెమేస్ పెడుతున్నారు. దించక్ పూజ పాట పెట్టుకుంటే అలార్మ్ అవసరం లేదని...వెంటనే నిద్రలేస్తానని ఓ నెటిజన్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. కరోనా టైంలోనూ దించక్ పూజకు ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ ఎలా వస్తున్నాయో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎవరేమనుకున్నా సరే దించక్ మాత్రం తన పాటలను జనాలపైకి వదులుతూనే ఉంటుందని కొందరు ఎద్దేవా చేశారు.