Begin typing your search above and press return to search.
ఇలాంటి ప్రేమ దేనికి సంకేతం ?
By: Tupaki Desk | 20 July 2019 2:30 PM GMTఇస్మార్ట్ శంకర్ ఇవాళ మూడో రోజులోకి అడుగు పెట్టింది. మాస్ ప్రేక్షకుల అండతో వసూళ్లు బాగా రాబడుతూ రేపటికల్లా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చని ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాట. ఇదిలా ఉండగా ఇందులో హీరో రామ్ కు హీరోయిన్ నభ నటేష్ లకు మధ్య ప్రేమను పుట్టించే సీన్ ని పూరి డిజైన్ చేసిన తీరు మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామ్ ఆటో ఎక్కిన నభ నటేష్ ని వెంటాడుతూ నేరుగా ఇంటిలోపలికి వెళ్లిపోవడం ముందు కోపం తెచ్చుకుని పోలీసులకు ఫోన్ చేసిన ఆ అమ్మాయి తర్వాత మంచం మీద వెళ్ళగానే అతని ప్రేమలో పడిపోవడం వచ్చిన ఖాకీలతో మాకు సెటిల్ మెంట్ అయిపోయింది అని చెప్పించడం ఒకరకంగా చెప్పాలంటే ఎబ్బెట్టుగా ఉంది.
సివిల్ ఇంజనీర్ చదువుకున్న అమ్మాయి ఇంత ఈజీగా తన ఒంటి పైకి వచ్చిన మగాడిని ప్రేమిస్తుందా అనే తరహాలో ఇచ్చిన ట్రీట్ మెంట్ నిజంగా విచిత్రమే పూరి సినిమాల్లో లాజిక్స్ ఉండవు. అది ఎవరూ కాదనలేని సత్యమే. కానీ కోట్లాది ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగే సినిమాను అందులోనూ యూత్ ఎక్కువగా చూసే అవకాశం ఉన్నప్పుడు కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే సమాజంలో తొమ్మిదేళ్ల పసిగుడ్డు నుంచి అరవై ఏళ్ళ బామ్మల దాకా అందరూ లైంగిక నేరాలలో బాధితులుగా మిగులుతున్నారు.
ఎందరో అమ్మాయిలు ప్రేమ పేరుతో నడిరోడ్డు మీద హత్యలకు యాసిడ్ దాడులకు గురువుతున్నారు. అమ్మాయి నచ్చితే చాలు విపరీత చేష్టలు చేస్తూ వికృతాలు చేసే కుర్రకారు పెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇంత సులువుగా అమ్మాయి శరీరాన్ని గట్టిగా కౌగలించుకుని తాకరాని చోట చేతులు కాళ్ళు వేసి ఇదే ప్రేమ అని పూరి లాంటి దర్శకులు చెప్పడం సబబు కాదనే కామెంట్ సినిమా చూసిన లేడీస్ నుంచి వినిపిస్తోంది. టెంపర్ లో సామాజిక స్పృహ కలిగించేలా ఇదే పాయింట్ ని గొప్పగా డీల్ చేసిన పూరి దానికి వ్యతిరేకంగా ఇలాంటి ట్రాక్స్ రాసుకోవడం గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం