Begin typing your search above and press return to search.

మళ్లీ తమిళ ప్రేమ చూపి విమర్శల పాలు

By:  Tupaki Desk   |   2 Dec 2018 1:30 AM GMT
మళ్లీ తమిళ ప్రేమ చూపి విమర్శల పాలు
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కావాలని చేస్తుండో లేదంటే కాకతాళీయంగా జరుగుతుందో కాని ఈమద్య వరుసగా తమిళ సినిమాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. దాంతో తెలుగు సినిమా ప్రేమికులు ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమిళ సినిమాలపై స్పందించడం నేరం కాదు కాని - తెలుగు సినిమాలను వదిలేసి కేవలం తమిళ సినిమాలనే అభినందించడం విమర్శలకు తెర లేపుతుంది. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైన సమయంలో ఫ్యాన్స్‌ ఎంతో మంది మహేష్‌ ఆ సినిమా గురించి స్పందించాలని కోరుకున్నారు. కాని మహేష్‌ నోట అరవింద మాట రాలేదు.

ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే వచ్చిన ‘సర్కార్‌’ సినిమాను ఆహా ఓహో అంటూ ప్రశంసించాడు. దాంతో అప్పుడు నందమూరి ఫ్యాన్స్‌ మహేష్‌ పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేశారు. తాజాగా మరోసారి తమిళ సినిమా ‘2.ఓ’ పై మహేష్‌ స్పందించి - బాగుందంటూ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు మణిరత్నం ‘నవాబ్‌’ సినిమా గురించి కూడా మహేష్‌ బాబు మాట్లాడిన విషయం తెల్సిందే. ఇలా వరుసగా తమిళ సినిమాలపై ప్రేమను చూపుతూ ఉన్న మహేష్‌ బాబు పై మరో సారి విమర్శలు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

మహేష్‌ బాబు కెరీర్‌ లో ఎక్కువ శాతం తమిళ దర్శకులతో కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. తమిళనాట పుట్టి - పెరిగినాడు కనుకే మహేష్‌ కు కోలీవుడ్‌ అంటే ఇంత అభిమానం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత విమర్శలు వస్తున్నా కూడా మహేష్‌ బాబు మాత్రం తాను అనుకున్నట్లుగానే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది మరోసారి రిపీట్‌ అయితే మరింతగా మహేష్‌ టార్గెట్‌ అయ్యే అవకాశం ఉంది.