Begin typing your search above and press return to search.
నయనతార ట్విన్స్.. ఎన్టీఆర్ ట్రోలింగ్ అవసరమా?
By: Tupaki Desk | 10 Oct 2022 4:05 AM GMTనటి నయనతార - దర్శకుడు విఘ్నేష్ శివన్ కవల పిల్లలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. తాము కవల మగబిడ్డలతో ఆశీర్వదించబడ్డామని విఘ్నేష్ స్వయంగా వెల్లడించారు. నయన్ అలాగే నేను అమ్మ & అప్పగా మారాము. మేము కవల పిల్లలతో ఆశీర్వదించబడ్డాము. మా ప్రార్థనలు, మా ఫ్యామిలీ ఆశీర్వాదం అన్నీ కూడా కలిసి ఈ విధంగా ఇద్దరు శిశువుల రూపంలో వచ్చాయి. అలాగే మా భవిష్యత్తు కోసం కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి.. అని విగ్నేష్ కోరుకున్నారు.
అయితే పెళ్లి జరిగే కనీసం నాలుగు నెలలైనా కాలేదు వీరికి ఇద్దరు కవల పిల్లలకు ఎలా జన్మనిచ్చారు అని సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఒక విధంగా దరిద్రమైన ట్రోలింగ్స్ కూడా జరుగుతునాయు. ఒకరి వ్యక్తిగత విషయాలపై ఆ విధంగా కామెంట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇక విగ్నేష్ నయనతార ఇద్దరు కూడా ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇక వీరు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఈ తరహాలో వారు పిల్లలను కొనడానికి కూడా ఒక కారణం ఉంది. నయనతారకు ఇదివరకే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వారి సన్నిహితులు తెలియజేశారు. వైద్యులు కూడా ఆమెకు సలహా ఇవ్వడంతో భర్త విగ్నేష్ సపోర్ట్ తో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇదే తరుణంలో సోషల్ మీడియాలో మరొక దరిద్రమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నయనతార ఒక సన్నివేశంలో కవల పిల్లలు పుడతారు అని పుట్టుమచ్చల జోస్యం చెప్పిన కామెడీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
పెళ్లి అయినా హీరోయిన్ విషయంలో ఈ విధంగా ట్రోలింగ్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నయనతార ఎంత హీరోయిన్ అయినప్పటికీ కూడా ఆమె ఆచారాలను పద్ధతులను కూడా చాలా చక్కగా పాటిస్తుంది.
ఆమెకు దైవ భక్తి కూడా చాలా ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ కూడా వారి సొంత నిర్ణయంతో ముందుకు సాగుతున్నప్పుడు పర్సనల్ ఫ్యామిలీ విషయంలో ఈ విధంగా ట్రోలింగ్స్ జరగడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని నయన్ ఫ్యాన్స్ ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.