Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: నటవారసులపై తీవ్ర దుమారం!
By: Tupaki Desk | 15 May 2022 9:46 AM GMTరోమ్ వెళితే రోమన్ లా ఉండాలి కానీ భారతదేశంలో ఉంటే ఇక్కడి ట్రెడిషన్ నే అనుసరించి దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్రవర్తన కూడా మారకూడదు. యువతీ యువకుల ప్రజల భాష యాస ఆహార్యం ప్రతిదీ పరిగణనలోకి వస్తుంది. అయితే ఈ విషయంలోనే గొప్ప ప్రతిభావంతులైన దర్శకులు కూడా తప్పటడుగులు వేస్తుంటారు. ఏదైనా రీమేక్ చేయాలంటే మారిన ప్రదేశం కల్చర్ వగైరా వగైరా పరిశీలించి దానికి తగ్గట్టు పాత్రల్ని మలచాల్సి ఉంటుంది. ఈ విషయంలో జోయా అక్తర్ ఫెయిలయ్యారా? అంటూ ఆర్చీస్ పై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇంతకుముందే నటవారసులను పరిచయం చేస్తూ ఆర్చీస్ ఫస్ట్ లుక్ టీజర్ ని లాంచ్ చేయగా దీనిపై రకరకాల స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇందులో ప్రశంసలతో పాటు ట్రోలింగ్ కూడా అసాధారణంగా ఉంది. పాశ్చాత్య `ఆర్చీస్` కామిక్స్ భారతీయ వెర్షన్ లోని తారాగణంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ది ఆర్చీస్ టీజర్ కొందరిని తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో నటీనటులు పూర్తి కాస్ట్యూమ్ లో తెల్లగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే రిపీట్ చేస్తున్నారంటూ విమర్శ చెలరేగింది.
ఈ చిత్రంతోనే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్- శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ - అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా తెరకు పరిచయమవుతున్నారు. వీరందరికీ తొలిచిత్రం కావడంతో ఈ చిన్న టీజర్ చర్చనీయాంశంగా మారింది. పోస్టర్ విడుదలైనప్పటి నుండి నెట్ ఫ్లిక్స్ ఇండియా దారుణంగా ట్రోలింగ్ కి గురవుతోంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో - ఏ దశాబ్దంలో టీనేజర్లు ఇలా దుస్తులు ధరించారు? అని ఒకరు వ్యాఖ్యానించారు.
మరో నెటిజన్ నెట్ ఫ్లిక్స్ ను ట్రోల్ చేస్తూ- ``ఆశ్చర్యం లేదు.. నెట్ ఫ్లిక్స్ డౌన్ అవుతోంది! భారతదేశంలో ఏ పాఠశాలలో ప్రాం రాత్రులు ఉన్నాయి? మీరు భారతీయ అభిరుచికి ఇక్కడి సంస్కృతి సున్నితత్వానికి సరిపోయే సిరీస్ ను రూపొందించలేకపోతే సభ్యత్వాన్ని ఆశించాల్సిన పని లేదు. నెట్ ఫ్లిక్స్ నుండి అలాంటి కంటెంట్ విడుదలైతే తమ సభ్యత్వాలను రద్దు చేసుకుంటామని మరి కొందరు హెచ్చరించారు.
జోయా అక్తర్ ఈ చిత్రం వెనుక ఉన్న కీలక మహిళ. అందువల్ల దర్శకురాలిని కూడా దారుణంగా ట్రోల్ చేసారు. చాలా మంది స్టార్ కిడ్స్ ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నందున నెపోటిజం అంశం తోనూ ట్రోలింగ్ షురూ అయ్యింది. ప్రోమోపై ఆరంభమే విమర్శలొచ్చాయి కాబట్టి క్రేజ్ కూడా తగ్గిపోతుందేమో! నెట్‌ఫ్లిక్స్ కచ్ఛితంగా దీనిపై సమీక్షిస్తుందేమో చూడాలి.