Begin typing your search above and press return to search.
కేజీఎఫ్.. సలార్ లను పోల్చుతూ కామెంట్స్
By: Tupaki Desk | 24 Aug 2021 10:46 AM GMTకేజీఎఫ్ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 విడుదల కాకుండానే సలార్ సినిమాను చకచక ముగించే పనిలో ఉన్నాడు. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ మెజార్టీ పార్ట్ షూటింగ్ ను ముగించారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి జగపతి బాబు లుక్ ను కూడా ప్రశాంత్ నీల్ రివీల్ చేయడం జరిగింది. జగపతిబాబును సలార్ లో రాజమన్నార్ సినిమాలో చూపించబోతున్నట్లుగా అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసి మరీ ప్రకటించాడు. ఈ పాత్రను కేజీఎఫ్ సినిమాలోని పాత్రతో పోల్చుతూ ప్రశాంత్ నీల్ ను కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో చేయబోతున్న సలార్ సినిమా కూడా కేజీఎఫ్ మాదిరిగానే ఉంటుంది అంటే మాత్రం తిరష్కరణ తప్పదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ స్పీడ్ గా సినిమాలు చేసే ఉద్దేశ్యంతో కథల విషయంలో కొత్తదనం కోల్పోతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ప్రభాస్ లుక్ తో పాటు తాజాగా విడుదల అయిన జగపతిబాబు లుక్ ను చూస్తుంటే సలార్ మరో కేజీఎఫ్ మాదిరిగా ఉంటుందేమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి సినిమా దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఆధరిస్తారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఖచ్చితంగా అభిమానులు లేదా సినీ విమర్శకులు దర్శకుడి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఖాయం. సలార్ కనుక కొత్తగా కేజీఎఫ్ ను మరపించే విధంగా లేకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు ప్రశాంత్ నీల్ మళ్లీ కన్నడ సినిమాలు చేసుకుంటూ ఉండాల్సి వస్తుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాని ప్రశాంత్ నీల్ అభిమానులు మాత్రం కేజీఎఫ్ కు సలార్ కు పోస్టర్ల విషయంలో పాత్రల విషయంలో కాస్త పోలిక ఉంటుందేమో కాని సినిమాలు రెండు పూర్తి విభిన్నంగా ఉంటాయనే నమ్ముతున్నాం అంటున్నారు. సలార్ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.