Begin typing your search above and press return to search.

శృతి సీన్ ల‌పై నెట్టింట ట్రోలింగ్

By:  Tupaki Desk   |   26 Feb 2023 9:00 PM GMT
శృతి సీన్ ల‌పై నెట్టింట ట్రోలింగ్
X
నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ ఫ్యాక్ష‌న్ డ్రామా 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో హ‌నీ రోజ్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ హిట్ అనిపించుకుంది. కానీ సంక్రాంతి విజేత‌గా మాత్రం నిల‌వ‌లేక‌పోయింది.

ఇదే స‌మ‌యానికి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీరయ్య‌' విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. సంక్రాంతి విజేత‌గా నిలిచింది. ఇదిలా వుంటే థియేట‌ర్ల‌లో ఫ‌ర‌వాలేద‌నిపించిన 'వీర సింహారెడ్డి' ఈ నెల 23న ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావ‌డం మొద‌లైంది. ఈ మ‌ధ్య థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాలని ఓటీటీ ప్రేక్ష‌కులు ఆ స్థాయిలో ఆద‌రించ‌డం లేద‌న్న‌ది తెలిసిందే.

ఇది 'కాంతార‌' లాంటి సినిమాల విష‌యంలోనూ రుజువైంది. సీన్ ల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి అనుభ‌వ‌మే నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి' కి కూడా ఎదుర‌వుతోంది.

గ‌త కొంత కాలంగా బాల‌య్య న‌టించిన సినిమాలు ట్రోల‌ర్స్ కి మంచి స్ట‌ఫ్ గా మారుతున్న నేప‌థ్యంలో తాజాగా 'వీర సింహారెడ్డి' కూడా ఈ జాబితాలో చేరింది. అయితే ఈ సారి బాల‌య్య‌ని కాకుండా ట్రోల‌ర్స్ శృతిహాస‌న్ ని టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సినిమాలో శృతిహాస‌న్ కు బాల‌య్య‌కు మ‌ధ్య కొన్ని ప‌రిచ‌య స‌న్నివేశాలున్నాయి. అవి చాలా సిల్లీగా వున్నాయిని, ఇలాంటి సీన్ ల‌తో ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఎలా త‌న‌ని క‌న్విన్స్ చేశాడ‌ని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఓ సీన్ లో శృతి .. బాల‌య్య కార‌ణంగా డ్ర‌గ్స్ తీసుకోవ‌డం..పిచ్చి పిచ్చిగా ఫ్లోర్ పై దొర్లుతూ డ్యాన్స్ చేయ‌డం ప‌రాకాష్ట‌గా వుంద‌ని స‌ద‌రు వీడియోని షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

గ‌తంలో బాల‌య్య సీన్ ల‌ని నెటిజ‌న్ లు ట్రోల్ చేయ‌డం చూశాం. కానీ ఇప్పుడు బాల‌య్య సినిమాలో న‌టించిన హీరోయిన్ ని నెటిజ‌న్ లు టార్గెట్ చేయ‌డం ఇదే తొలిసారి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.