Begin typing your search above and press return to search.
ఉరుమెళ్లి మంగళం మీద పడ్డట్లు ఇదేంది సామీ!
By: Tupaki Desk | 30 Sep 2022 7:41 AM GMTఉరుమెళ్లి మంగళం మీద పడ్డట్లు..ఈ వాతలు నాకేంది? సామీ అన్నట్లు మారింది తాజా సన్నివేశం. అవును నిన్నటి రోజున రెబల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభ సందర్భంగా అభిమానుల కోసం మొగల్తూరులో భారీ ఎత్తున లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. రకరకాల నాన్ వెజ్ వంటకాలతో అభిమానులు కడుపునిండా భోజనం పెట్టి ఇంటికి పంపారు.
ఇప్పుడీ సన్నివేశాన్ని టాలీవుడ్ లో మిగతా హీరోలకి ఆపాదించి మెగా నందమూరి వార్ గా మార్చేసారు. ఆ రెండు కుటుంబాల హీరోల్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు కొందరు. డార్లింగ్ మంచి భోజనం పెట్టాడు సరే? కోట్లు వేనకేసిన మీ హీరో కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదని ఓ హీరో అభిమానులు అనగా..మరో హీరో అభిమానులు మరి మీ హీరో ఏం చేసాడు? అంటూ ఎటాకింగ్ కి దిగారు.
కొన్ని మార్పింగ్ ఫోటోలు తయారు చేసి ఒకరిపై ఒకరు బుదర జల్లుకోవడం మొదలుపెట్టారు. ఓస్టార్ హీరో భోజనం చేస్తున్న పాత ఫోటో తీసి అన్ని వంటకాలు ఉన్నాయి కాబట్టే లంచ్ కి వెళ్లిపోయారంటూ కామెంట్ చేయగా....మరో హీరో అభిమానులు ఆహీరో అయితే ఏకంగా భోజనం చేయడంతో పాటు ..ఇంటికి క్యారేజీ కూడా తీసుకెళ్లాడంటూ ప్రచారానికి తెర తీసారు.
ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయడానికి ..ఈ ఇద్దరి హీరోలకి ఏం సంబంధం లేదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకునే సిల్లీ ప్రయత్నాలు మినహా అంతకు మించి ఇక్కడేం లేదు. ఉరిమెళ్లి మంగళం మీద పడట్లు..ఇందులోకి మెగా-నందమూరి హీరోల్ని లాగడం దేనికి? అంటూ ఆ రెండు వర్గాల కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రోలింగ్ అనేది హాస్యాస్పదంగా ఉండాలి. ఎదుట వారికి నవ్వు తెప్పించేలా ఉండాలి. అర్ధం లేని మీమ్స్ వద్దంటూ మండి పడుతున్నారు. ఇలాంటివి చదివారికి..చూసే వారికి ఏహ్యాంగా అనిపిస్తుంది. ఒక హీరో పై ఉన్న వీర అభిమానాన్ని మరో హీరోని కించ పరచడానికి ఉపయోగించొద్దంటూ కోరుతున్నారు.
మరి ట్రోలర్ రాజాలు వీటిని సీరియస్ గా తీసుకుంటారా? లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి. సోషల్ మీడియాలో ఇలాంటివన్ని సహజం. ఇటీవలి కాలంలో ట్రోలింగ్ మరింత ఎక్కువ అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ట్రోలర్లకి ఆహారంగా మారిపోవాల్సిందే. అంతంగా ట్రోలింగ్ ప్రభావం వెబ్ మీడయాలో కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.