Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ అమెరిక‌న్ యాక్సెంట్ పై ఫేక్ ప్ర‌చారం!

By:  Tupaki Desk   |   11 Jan 2023 6:59 AM GMT
యంగ్ టైగ‌ర్ అమెరిక‌న్ యాక్సెంట్ పై ఫేక్ ప్ర‌చారం!
X
ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పార్ ఇండియా సంచ‌ల‌నం 'RRR'. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార్ మూవీ ఇది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ ప్ర‌స్తుతం గోల్డెన్ గ్లోబ్ పుర‌స్క‌రాన్ని ద‌క్కించుకుని ప‌తాక శీర్షిక‌ల కెక్కిన విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ కి చెందిన ఫిక్ష‌న‌ల్ స్టోరీగా తెర‌కెక్కింది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొద‌లైన త‌రువాత 'RRR'పై విదేశీ ప్రేక్ష‌కులు, టెక్నీషియ‌న్స్‌, హాలీవుడ్ న‌టీన‌లు, డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌స్తున్నారు. దీంతో ఈ మూవీపై వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ తో పాటు ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. మేకింగ్ ప‌రంగా ఇండియ‌న్స్ ఏ స్థాయిలో ఎదిగారో హాలీవుడ్ మేక‌ర్స్ కి క్లారిటీ రావ‌డంతో మ‌న వాళ్లు క్రియేటివిటీకి, యాక్ష‌న్ సీక్వెన్స్ ల‌ని చిత్రీక‌రించిన తీరుకు హాలీవుడ్ స్టార్స్‌, విదేశీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయి నెట్టింట 'RRR' ని వైర‌ల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఇదిలా వుంటే అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న 'RRR' ప‌లు అంత‌ర్జాతీయ పుర‌స్కార వేదిక‌ల‌పై త‌న సత్తా చాటుకుంటూ తాజాగా హాలీవుడ్ స్టార్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం 'RRR' సొంతం చేసుకోవ‌డం విశేషం. బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్ నాన్ ఇంగ్లీష్ విభాగంతో పాటు బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాట‌కు గాను 'RRR' ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ద‌క్కించుకుని ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే స‌రికొత్త‌ చ‌రిత్ర సృష్టించింది.

ఈ సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీక్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చిత్ర బృందంతో క‌లిసి అమెరికాలో వున్న విష‌యం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం 'RRR' కు ద‌క్కిన నేప‌థ్యంలో చిత్ర బృందం ప‌లు అంత‌ర్జాతీయ మీడియాల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. 'RRR' ఆస్కార్ అవార్డుల్లోనూ ఎంట్రీని సాధించిన నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మీడియా చిత్ర బృందంపై ప్ర‌త్యేక ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిల‌తో ప్ర‌త్యేకం ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేసింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఇండియ‌న్ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల్ని వెల్ల‌డిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ అమెరిక‌న్ యాక్సెంట్ పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ అంటూ ఓ ఫేక్ ప్ర‌చారం మొద‌లైంది. ఎన్టీఆర్ అమెరిక‌న్ యాక్సెంట్ ని ట్రై చేయ‌డం కంటే ఇండియ‌న్ ఇంగ్లిష్ లో మాట్లాడితే బాగుంటుంద‌ని కామెంట్ లు చేస్తున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఈ ప్ర‌చారం వ‌ట్టి ఫేక్ అని తేలిసింది. కొంత మంది కావాల‌నే ఇలాంటి ఫేక్ ప్ర‌చారాన్ని చేస్తున్నార‌ని ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు.

ఎన్టీఆర్ కు తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో మంచి ప‌ట్టున్న విష‌యం తెలిసిందే. తెలుగులో సింగిల్ టేక్ లో పేజీల కొద్ది డైలాగ్ లు చెప్ప‌గ‌ల స‌త్తా ఎన్టీఆర్ సొంతం. త‌ను స్టేజ్ ఎక్కి మాట్లాడితే వినాల‌ని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయితే త‌ను అంత‌ర్జాతీయ మీడియా ముందు అమెరిక‌న్ యాక్సెంట్ ని ట్రై చేస్తుండ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతుండ‌గా..త‌న యాక్సెంట్ పై కొంత మంది కామెంట్ లు చేస్తున్నారంటూ ఫేక్ ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.