Begin typing your search above and press return to search.

ఆమె అదనపు బాదుడు నిర్మాతల గగ్గోలు

By:  Tupaki Desk   |   3 March 2022 5:29 AM GMT
ఆమె అదనపు బాదుడు నిర్మాతల గగ్గోలు
X
టాలీవుడ్‌ తో పాటు ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ కు అసిస్టెంట్స్ ఉంటారు. షూటింగ్ లో స్టార్స్ పాల్గొంటున్న సమయంలో వారి అసిస్టెంట్స్ కూడా పక్కనే ఉంటారు. అప్పుడు అసిస్టెంట్స్ కు సంబంధించిన రోజువారి వేతనంను నిర్మాతల వద్ద వసూళ్లు చేయడం చాలా మంది చాలా కాలంగా చేస్తున్న పని. తమ పర్సనల్‌ అసిస్టెంట్స్ కు నెల నెల జీతం ఇస్తూనే ఇలా షూటింగ్‌ కు హాజరు అయిన సమయంలో నిర్మాతల వద్ద ముక్కు పిండి వసూళ్లు చేసి ఇవ్వడం ఏంటో విడ్డూరం కాకుంటే.

హీరోయిన్స్ అగ్రిమెంట్‌ సమయంలోనే తమ పారితోషికంతో పాటు ట్రావెల్‌ అలయెన్స్.. అసిస్టెంట్స్ చార్జ్‌ ఇలా పలు విషయాలను పేర్కొని భారీగా వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక స్టార్‌ హీరోయిన్‌ అదనంగా వసూళ్లు చేస్తున్న చార్జీ కి నిర్మాత గగ్గోలు పెడుతున్నాడు అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఆమె ఒక స్టార్‌ హీరోయిన్‌. ఆమె ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ ఉంది.

టాప్‌ హీరోయిన్ గా ఉన్న ఆమెకు టాలీవుడ్‌ లోనే అత్యధిక పారితోషికం ఇస్తున్నారట. అయినా కూడా ఆమె తన అసిస్టెంట్స్ కు రోజు వారి వేతనంను భారీ మొత్తంలో నిర్మాతల నుండి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ లో ఒక సినిమా పని మీద వచ్చిన ఆమె కు ఫైవ్ స్టార్‌ హోటల్‌ ను నిర్మాతలు కేటాయించారు. అక్కడ ఆమె అసిస్టెంట్స్ కు ప్రత్యేకంగా వసతి కల్పించడంతో పాటు వారికి రోజు వారి జీతం ఇచ్చారట.

రెగ్యులర్ కంటే ఈసారి ఆ స్టార్‌ హీరోయిన్‌ తన స్టాప్‌ కు భారీగా వసూళ్లు చేసిందట. నిర్మాత కేవలం ఆమె స్టాప్ కోసం దాదాపుగా 15 లక్షల వరకు ఖర్చు చేశాడట. అది కూడా సినిమా పూర్తి అయ్యింది.. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ కోసం హీరోయిన్‌ రావడం.. ఆమె ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని మూడు నాలుగు రోజులు చేసిందట. దాంతో నిర్మాతకు తడిసి మోపెడు అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరోలు మరియు హీరోయిన్స్ తమ వ్యక్తిగత స్టాప్‌ కు వారే జీతాలు ఇచ్చుకోవాలని.. పారితోషికం తప్ప మరేమి డిమాండ్‌ చేయవద్దంటూ నిర్మాతలు గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు మాత్రం దాన్ని పాటిస్తే ఎక్కువ శాతం మంది భారీ మొత్తంలో తమ స్టాఫ్ కోసం వసూళ్లు చేస్తూనే ఉన్నారు. నిర్మాతలు ఖర్చు తగ్గించేందుకు ఎంత ప్రయత్నిస్తే అంతగా ఈ అదనపు ఖర్చులు అవుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు.