Begin typing your search above and press return to search.
లక్ష్మీస్ ఎన్టీఆర్... టెన్షన్ పడుతున్న బయ్యర్లు
By: Tupaki Desk | 7 March 2019 5:40 AM GMTభారీ అంచనాల నడుమ వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' మరియు 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు దారుణమైన ఫలితాలను చవిచూశాయి. బాలకృష్ణ కెరీర్ లోనే అతి తక్కువ వసూళ్లు చేసిన సినిమాగా ఎన్టీఆర్ మహానాయకుడు నిలిచింది. కేవలం అయిదు కోట్లు మాత్రమే మహానాయకుడు వసూళ్లు చేయడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల నేపథ్యంలో వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీపై ఉంది. ఎన్టీఆర్ జీవితంలోకి ఎలాంటి పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి వచ్చింది, ఆమె రాకతో ఆయన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటీ అనే విషయాలతో చంద్రబాబు నాయుడును విలన్ గా చూపింస్తూ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించాడనే విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ ఆశీస్సులతో మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాను అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బిజినెస్ క్లోజ్ కూడా అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. తాజాగా సినిమాను కొన్న బయ్యర్లు అంతా కూడా కలిసి వర్మ వద్దకు వెళ్లారని, సినిమా విడుదల తేదీ విషయంలో మరోసారి ఆలోచించాలని కోరినట్లుగా తెలుస్తోంది. 21వ తారీకున అల్లు శిరీష్ 'ఏబీసీడీ' చిత్రంతో పాటు మూడు నాలుగు చిన్న చితకా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలకు ముందుగానే థియేటర్లు బుక్ అయ్యాయి.
22వ తారీకున విడుదల చేయాలనుకుంటున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు ఎక్కువ థియేటర్లు లభించడం లేదు. ఆ కారణంగానే వారం ముందుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయాల్సిందిగా బయ్యర్లు వర్మను కోరినట్లుగా సమాచారం అందుతోంది. అయితే వర్మ మాత్రం తాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది. ఏం జరుగనుందో చూడాలి.