Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: శాటిలైట్ ని మింగేసిన క‌రోనా

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:50 PM GMT
ట్రెండీ టాక్‌: శాటిలైట్ ని మింగేసిన క‌రోనా
X
మ‌హ‌మ్మారీ క్రైసిస్ అనూహ్యంగా స‌మీక‌ర‌ణాలు మార్చేస్తోంది. ఇప్ప‌టికే సినీప‌రిశ్ర‌మ‌ను ఊహించ‌ని దెబ్బ కొట్టింది. ఇక ఉన్న‌ట్టుండి ఈ క్రైసిస్ లో ఓటీటీ-డిజిట‌ల్ హ‌వా అనూహ్యంగా పెర‌గ‌డంతో అది థియేట్రిక‌ల్ బిజినెస్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా నాశ‌నం చేస్తోంద‌న్న భ‌యాందోళ‌న వ్య‌క్త‌మైంది. ఎగ్జిబిట‌ర్లు ఇప్ప‌టికీ దీనిని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

మ‌హ‌మ్మారీ వెళ్లిపోయినా ఇప్పుడు థియేట్రిక‌ల్ బిజినెస్ పుంజుకునేదెలా? అన్న డైల‌మా లో ఉన్నారంతా. ఇక ఇదొక్క‌టే స‌మ‌స్య కాదు. డిజిట‌ల్ - ఓటీటీ వ‌ల్ల శాటిలైట్ బిజినెస్ పైనా పంచ్ ప‌డిపోతోంద‌ని స‌మాచారం. డిజిట‌ల్ వీక్ష‌ణ‌కు అల‌వాటుపడిన జ‌నం టీవీ ప్రీమియ‌ర్ల కోసం వేచి చూడ‌డం లేదు. దీంతో టీవీల్లో టీఆర్పీలో దారుణంగా ప‌డిపోయాయి. ఇది శాటిలైట్ బిజినెస్ పై తీవ్రమైన ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇంత‌కుముందు పెద్ద హీరోల సినిమాల‌కు 15-20 మ‌ధ్య‌లో టీఆర్పీ న‌మోద‌య్యేది. కానీ ఇటీవ‌ల ప‌ది వ‌ర‌కూ వెళ్ల‌డం కూడా క‌ష్ట‌మ‌వుతోంద‌ట‌. 6-7 మ‌ధ్య‌లో టీఆర్పీ నిలిచిపోతుండ‌డం స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ట‌. ఇటీవ‌ల టీవీల్లో ప్ర‌సారం చేసిన వాటిలో సాహో -6 .. భీష్మ‌-6.65 .. అల వైకుంఠ‌పుర‌ములో- 7.91 టీఆర్పీల‌ను మాత్ర‌మే న‌మోదు చేసాయి. అంటే టీఆర్పీ స‌గానికి స‌గం ప‌డిపోయింద‌నే దీన‌ర్థం. మొద‌టి సారి ప్రీమియ‌ర్ వేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. రెండోసారి రీటెలీకాస్ట్ చేస్తే అస‌లే ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ వాపోతున్నార‌ట‌. 29 టీఆర్పీ వ‌చ్చిన అల‌వైకుంఠ‌పుర‌ములో రీటెలీకాస్ట్ చేస్తే 8 లోపు ప‌డిపోవ‌డం అంటే ఘోర‌మే ఇది.

అయితే టీఆర్పీ ప‌డిపోవ‌డానికి కార‌ణం టీవీల్లో ప్రివ్యూ స‌మ‌యాలు ఒక‌టి అయితే.. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు చూసేంత ఓపిక జ‌నాల‌కు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం అని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ లో యాడ్లు లేకుండానే సినిమా మొత్తం చూడొచ్చు. కానీ టీవీలో అయితే ప్ర‌క‌ట‌న‌లు అన్నీ చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఓటీటీల్లో మ‌న‌కు కావాల్సిన స‌మ‌యంలో వీక్షించే అవ‌కాశం ఉంటుంది. పైగా ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఇంట్లో కొనేది స్మార్ట్ టీవీ మాత్ర‌మే. ఇంత‌కుముందులా డ‌బ్బా టీవీలు ఎవ‌రూ వాడ‌డం లేదు. ఏది ఏమైనా శాటిలైట్ బిజినెస్ విరుగుడుకు క‌రోనా కారణ‌మ‌వుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.