Begin typing your search above and press return to search.

ఆస్కార్ కి ఆడియన్స్ ఆదరణ తగ్గింది

By:  Tupaki Desk   |   2 March 2016 11:30 AM GMT
ఆస్కార్ కి ఆడియన్స్ ఆదరణ తగ్గింది
X
ఆస్కార్ అవార్డుల వేడుక.. ప్రపంచంలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ ఉండే సినీ కార్యక్రమం ఇదే. ఈ ఏడాది జరిగిన 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానాన్ని కూడా భారీ సంఖ్యలోనే ప్రేక్షకులు చూశారు. కానీ గతంతో పాల్చితే మాత్రం ఈ సారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో నిరవ్హించిన ఆస్కార్ వేడుకను 3.43 కోట్ల మంది మత్రమే టీవీల్లో చూశారు. ఈ ఏడాది కమెడియన్ క్రిస్ రాక్ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యతగా వ్యవహరించారు.

అయితే.. గతేడాది నీల్ పాట్రిక్ హారిస్ వ్యాఖ్యానం చేసినపుడు.. ఆస్కార్ వేడుకను 3.73కోట్ల మంది వీక్షించారు. 2014లో అయితే ఈ సంఖ్య అత్యధికంగా 4.37 కోట్లు. 2013లో 4.03 కోట్లు, 2012 లో 3.93 కోట్లు, 2011లో 3.79 కోట్లు, 2010లో 4.13 కోట్లు, 2009లో 3.63 కోట్లమంది ప్రేక్షకులు టీవీల్లో ప్రత్య ప్రసారం చూశారు. 2008లో 3.2 కోట్ల మంది లైవ్ ప్రసారాలను చూడగా.. ఇప్పుడు దాదాపు ఆ స్థాయకి ప్రేక్షకుల సంఖ్య పడిపోయింది. ఈ స్టాటిస్టిక్స్ నీల్సన్ ప్రకటించింది.

అయితే.. వరుసగా పెరుగుతూ వస్తున్న ప్రేక్షకుల సంఖ్య.. ఈ సారి తగ్గడానికి గల కారణాలను ఆస్కార్ అకాడమీ పరిశీలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ వేడుకకు.. టీవీల్లో వీక్షించే ఆడియన్సే అతి ముఖ్యమైన ఆదాయవనరు. అయితే.. లైవ్ ప్రసారాల కోసం తమ విధానాలు మార్చుకోబోమని చెప్పడం విశేషం.